రెండు ప్రేమ‌క‌థ‌లు..పున‌ర్జ‌న్మ‌ల‌తో నాని 27

  • IndiaGlitz, [Tuesday,February 25 2020]

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే త‌న 25వ సినిమా 'వి'ను పూర్తి చేశాడో లేదో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా త‌న 26వ సినిమాకు రెడీ అయిపోయాడు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో 'ట‌క్ జ‌గ‌దీష్‌' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాకుండా త‌న 27వ సినిమాను రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో 'శ్యామ్ సింగ రాయ్‌'ని అనౌన్స్ చేశాడు. 'టాక్సీవాలా' త‌ర్వాత రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కనున్న చిత్ర‌మిది.

నిజానికి ముందు రాహుల్ సంక్రిత్యాన్ టైమ్ మెషీన్ కాన్సెప్ట్‌తో సినిమా క‌థ‌ను త‌యారు చేసుకున్నాడు. హీరోల‌ను క‌లిసినా కూడా ఎవ‌రూ ఒప్పుకోలేదు. దాంతో ఈ ద‌ర్శ‌కుడు మ‌రో స‌బ్జెక్ట్‌తో నానిని ఒప్పించాడ‌ని టాక్‌. వివ‌రాల మేర‌కు ఇదొక ప్రేమ‌క‌థ‌. ఇందులో రెండు ప్రేమ‌క‌థ‌లుంటాయ‌ట‌. అందులో ఒక‌టి హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగితే.. మ‌రో ప్రేమ‌క‌థ కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంద‌ట‌. ఈ రెండు ప్రేమ‌క‌థ‌ల‌కు పున‌ర్జ‌న్మ‌ల లింక్ ఉంటుంద‌ని స‌మాచారం. మ‌రి నాని ఇందులో డ‌బుల్ రోల్ చేస్తాడా? లేదా? అస‌లు ఎలాంటి లుక్‌లో క‌న‌ప‌డ‌తాడు? అనే వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

More News

చంద్రబాబును జగన్ ఓడించారని ట్రంప్‌కు కోపం!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే..

పూరితో ప‌వ‌ర్‌స్టార్‌..?

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తున్నాడు.

నిర్మాత‌గా మారుతున్న చైత‌న్య‌

అక్కినేని వార‌సుల్లో మూడో త‌రం హీరోలుగా అక్కినేని చైత‌న్య‌, అఖిల్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే.

భారత్ పర్యటన ఎప్పటికీ మర్చిపోలేను: ట్రంప్

అగ్రరాజ్యం అధినేత డోనాల్డ్ ట్రంప్ రెండ్రోజుల పర్యటన అనంతరం మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై సీనియర్ నటి ఫైర్!

దేశ రాజధానిలో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సీఏఏ వ్యతిరేక నిరసనలతో ఢిల్లీలో హింసాత్మకంగా మారింది.