close
Choose your channels

అంటే సుందరానికి: నాని పుట్టినరోజు స్పెషల్..  రేపు ‘‘బర్త్ డే హోమం’’

Tuesday, February 22, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేకుండా వున్న నేచురల్ స్టార్ నానీ ‘‘శ్యామ్ సింగరాయ్’’ విజయంతో మంచి జోష్‌లో వున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం ‘‘అంటే సుందరానికి’’. ఈ సినిమాలో నాని డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. పంచెకట్టుతో.. సరికొత్త అవతారంలో కనిపిస్తున్న నాని.. సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 24న నాని బర్త్ డే సందర్భంగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఇందుకోసం రేపు 4:05 నుంచి ‘హోం అలెర్ట్’ అంటూ.. ఈ సుందరుడి పుట్టిన రోజు సందర్భంగా ‘బర్త్ డే హోమం’ అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘మీ భావాలను చక్కిలిగింతలు పెట్టేందుకు వస్తున్న యువ సుందర్ చమత్కారమైన ఛాయను చూసుకోండి’ అని పేర్కొన్నారు.

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజారాణి ఫేమ్ నజ్రియా నజిమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్నారు. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే సమ్మర్‌లో బడా సినిమాలు లైన్‌లో వుండటంతో ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు.

'మీరంతా రెండు మూడు బ్లాక్ చేస్తే... మేము ఏడు చేయకూడదా?' అని నాని అడిగారు. 'ఫుల్ ఆవకాయ సీజన్ బ్లాక్డ్. మెల్లగా డిసైడ్ చేద్దాం' అని స్వయంగా హీరో నాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ఏప్రిల్ 22, 29 .. మే 6, 20, 27 .. జూన్ 3, 10లలో ఏదో ఒక తేదీలో 'అంటే సుందరానికి' ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నమాట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.