Dasara: నాని 'దసరా' ఫస్ట్ సింగిల్ 'ధూమ్ ధామ్' సాంగ్

  • IndiaGlitz, [Saturday,October 01 2022]

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'దసరా' నుండి మాస్ , రగ్గడ్ డ్యాన్స్ మూవ్‌లతో కూడిన మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ దసరా రోజున విడుదల కానుంది. సంతోష్ నారాయణ్ స్వరపరిచిన ధూమ్ ధామ్ ధోస్థాన్ పాటలో బొగ్గు గనుల్లో తన స్నేహితులతోపాటు అద్భుతమైన డ్యాన్స్‌లతో అలరించబోతున్నారు నాని.

తాజాగా ఈ పాట నుండి విడుదలైన పోస్టర్ నాని రా, రస్టిక్ గెటప్ ఊహతీతంగా వుంది. నాని లుక్ ద్వారా ఆయన పాత్ర యొక్క రగ్గడ్ నెస్ ని ఊహించవచ్చు. గుబురు గడ్డం,మాసీ జట్టు, లుంగీ ధరించి, లోపల బనియన్, ఓపెన్ షర్టుతో మిలియన్ డాలర్ల చిరునవ్వుతో మెస్మరైజ్ చేశారు నాని.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జాతీయ అవార్డువిన్నర్ కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడిగా కనిపించనుంది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 30 మార్చి 2023న విడుదల కానుంది.

తారాగణం: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు.

More News

Allu Studios: అల్లు స్టూడియోస్‌ని ప్రారంభించిన చిరంజీవి... తాతయ్య కల నెరవేర్చామన్న బన్నీ

దశబ్ధాల పాటు తెలుగు వారిని నవ్వుల జల్లులో తడిపిన దిగ్గజ నటుడు , పద్మశ్రీ అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లో

Hyderabad New Traffic Restrictions: ‘‘గీత’’ దాటితే ఫైనే... హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్, బీ అలర్ట్

హైదరాబాద్ నగరంలో ఇకపై అడ్డదిడ్డంగా వాహనాలు నడిపివారికి, ఏ మాత్రం రూల్స్ పాటించని వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.

బిగ్‌బాస్ సీజన్‌ 6లో తొలి మహిళా కెప్టెన్‌గా కీర్తి... రెండోసారి కటకటాల వెనక్కి అర్జున్

బిగ్‌బాస్ సీజన్ 6లో తొలిసారి ఓ మహిళా కెప్టెన్‌కి ఛాన్స్ దొరికింది అది కూడా ఎవ్వరూ ఊహించని విధంగా కీర్తి భట్ కెప్టెన్ కావడం విశేషం.

Nagarjuna : లీడర్‌గా నటిస్తా కానీ.. లీడర్ మాత్రం కాను, పొలిటికల్ ఎంట్రీపై తేల్చేసిన నాగార్జున

వైసీపీ అభ్యర్ధిగా, విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి తాను బరిలోకి దిగుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఖండించారు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున.

Harihara Veera Mallu: ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్ లో 'హరిహర వీర మల్లు'

విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించగల విజయవంతమైన చిత్రాలను రూపొందించడంతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దిట్ట.