ఫిబ్రవరి 24న నాని, డి.వి.వి.దానయ్య చిత్రం ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Wednesday,February 22 2017]

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.3గా నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. ఫిబ్రవరి 24 హీరో నాని పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ కూడా చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ - ''ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ అమెరికాలో జరుగుతోంది. మార్చి 10 వరకు ఈ షెడ్యూల్‌ వుంటుంది. మా హీరో నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేయడంతోపాటు టైటిల్‌ని కూడా ఎనౌన్స్‌ చెయ్యబోతున్నాం'' అన్నారు.
నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., రచన, దర్శకత్వం: శివ నిర్వాణ.

More News

సూర్యతో కూడా రెడీ అయ్యింది...

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ నెమ్మదిగా తమిళ సినిమా రంగం వైపు దృష్టి సారిస్తుంది.

నిర్మాతగా మారుతున్న మ్యూజిక్ డైరెక్టర్....

మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ అయిన రఘు కుంచె ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు.

సీక్వెల్ లో కూడా ఆమె.....

చియాన్ విక్రమ్,హరి కాంబినేషన్ 2003లో వచ్చిన 'సామి'ఎంతటి సెన్సేషనల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

అఖిల్, శ్రియాల పెళ్లి ఆగిందా..?

అక్కినేని అఖిల్, ష్యాషన్ డిజైనర్ ప్రముఖ వ్యాపారవేత్త జి.వి.కె మనవరాలు శ్రియా భూపాల్ మధ్య గత ఏడాది డిసెంబర్లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థ వేడుక జరిగిన సంగతి తెలిసిందే.

'మా అబ్బాయి' గా వస్తున్న నన్ను మీ అబ్బాయిలా ఆదరించండి - హీరో శ్రీ విష్ణు

`ప్రేమ ఇష్క్ కాదల్,ప్రతినిధి,'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన హీరో శ్రీ విష్ణు కథానాయకుడుగా