నాని హీరోగా డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి'

  • IndiaGlitz, [Thursday,February 23 2017]

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.3గా నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి'. ఫిబ్రవరి 24 హీరో నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాత డి.వి.వి.దానయ్య నానికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ 'నిన్ను కోరి' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ప్రస్తుతం అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతోంది. మార్చి 10 వరకు అమెరికా షెడ్యూల్‌ వుంటుంది. తర్వాత వైజాగ్‌లో జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, ప థ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., రచన, దర్శకత్వం: శివ నిర్వాణ.

More News

తెలుగు ప్రేక్షకులంతా 'మెట్రో' చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా: గీతా మాధురి

ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై `ప్రేమిస్తే`, `జర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో రజని రామ్ నిర్మించిన సినిమా `మెట్రో`. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న చైన్ స్నాచింగ్లను కళ్ళకు కడుతూ.. తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో మార్చి 3న విడుదల చేస్తున్నారు.

మహా శివరాత్రి సందర్భంగా 'ఉంగరాల రాంబాబు' హీరో సునీల్ ఫస్ట్ లుక్ విడుదల

ఇటీవలే 'జక్కన్న' తొ కమర్షియల్ సక్సెస్ ని తన సొంతం చేసుకొని సూపర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు.

రాశి కీలకపాత్రలో వస్తున్న 'లంక'

నిన్నటితరం అందాల భామ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ "లంక". శ్రీముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేశారు

'విన్నర్ ' తేజు రేంజ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్ళే చిత్రమవుతుంది - గోపీచంద్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'.

'కేరాఫ్ గోదావరి' పది నిమిషాల సినిమా విడుదల

"క్యాప్షన్ పెట్టాలంటే పోస్టర్ పట్టదండోయ్" అనే వెరైటీ ట్యాగ్ లైన్ తో రూపొందిన చిత్రం "కేరాఫ్ గోదావరి". రోహిత్.ఎస్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఉషా మూవీస్ సమర్పణలో ఆర్.ఫిలిమ్స్ ఫ్యాక్టరీ ప్లస్ ప్రొడక్షన్స్-బొమ్మన ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై తూము రామారావు(బాబాయ్)-బొమ్మన సుబ్బారాయుడు-రాజేష్ రంబాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.