close
Choose your channels

ఆగష్టు 28న ఫ్యామిలీఎంటర్టైనర్ 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌' థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల

Monday, August 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆగష్టు 28న ఫ్యామిలీఎంటర్టైనర్ నానిస్‌ గ్యాంగ్‌ లీడర్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీఎంటర్టైనర్ 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ కార్తికేయ ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ ఆగష్టు 28 న విడుదలకాబోతుంది.

ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...

నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ - ''ముందుగా మీడియా మిత్రులందరికీ అడ్వాన్స్‌గా వినాయక చవితి శుభాకాంక్షలు. 'గ్యాంగ్‌లీడర్‌' అనేది ఫస్ట్‌ నుండి మాకు చాలా హ్యాపీ ప్రాజెక్ట్‌. టీమ్‌ అందరం ఎంతో ఇష్టపడి ఎంజాయ్‌ చేస్తూ సినిమా చేశాం. నా అన్ని సినిమాల్లో నేను ఎక్కువ ఎంజాయ్‌ చేసిన సినిమా ఇదే. ప్రతి ఒక్కరూ ఒక పాజిటివ్‌ ఎనర్జీతో సినిమా స్టార్ట్‌ చేశారు. అందుకు తగ్గట్లే మంచి అవుట్‌ ఫుట్‌ వచ్చింది. ఆగష్టు 28న 'గ్యాంగ్‌ లీడర్‌' థియేట్రికల్‌ ట్రైలర్‌ను అన్ని థియేటర్స్‌లో ప్లే చేయబోతున్నాం..అలాగే ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ సెప్టెంబర్‌ మొదటి వారంలో విడుదల చేయబోతున్నాం. సినిమా విడుదలకోసం చాలా ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నాం. కార్తికేయ నెగటివ్‌రోల్‌లో అదరగొట్టాడు.

నిజంగా తను మంచి పెర్ఫార్మర్‌. అలాగే మొదటి సినిమా అయినా ప్రియాంక బాగా చేసింది. తను పీసి గారి ఛాయిస్‌. అలాగే సీనియర్‌ నటి లక్ష్మీ గారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం నిజంగా హ్యాపీ. ఆమెతో వర్క్‌ చేయడం ఒక లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఆవిడ అన్ని భాషలు మాట్లాడతారు. అలాగే శరణ్య గారు 'నాయకుడు' సినిమా నుండి ఆవిడ టైమింగ్‌ కానీ పెర్ఫామెన్స్‌ కానీ నాకు చాలా ఇష్టం. ఇది రివేంజ్‌ ఎంటర్టైనర్‌ అనే కొత్త జోనర్‌ ఉండే సినిమా. ఈ సినిమాలో మా గ్రూప్‌ పేరు రివెంజర్స్‌అసెంబుల్డ్‌. తప్పకుండా మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది. మైత్రి మూవీస్‌ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు వారి ప్రొడక్షన్‌ వాల్యూస్‌ ఇప్పటికే టీజర్‌లో మీరు చూశారు.. రేపు ట్రైలర్‌ రిలీజయ్యాక మీకే తెలుస్తుంది. ట్రైలర్‌కి కూడా అంత కన్నా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. 'జెర్సీ' సినిమా చేస్తున్నప్పుడే మ్యూజిక్‌ నచ్చి అనిరుద్‌ని సెలెక్ట్‌ చేయడం జరిగింది. ఈ సినిమాకు కూడా మంచి సంగీతం అందించారు. మిరోస్లా కుబా బ్రోజెక్‌ పోలెండ్‌లో చాలా ఫేమస్‌ సినిమాటోగ్రాఫర్‌. విక్రమ్‌ తన ఫ్రెండ్‌ ద్వారా అతన్ని కాంటాక్ట్‌ అయ్యి ఈ ప్రాజెక్టుకి ఓకే చేశారు. మంచి విజువల్స్‌ ఇచ్చారు. ఆగష్టు 28న విడుదలయ్యే థియేట్రికల్‌ ట్రైలర్‌ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను 'అన్నారు.

నటుడు కార్తికేయ మాట్లాడుతూ - '' 'గుణ 369' షూటింగ్‌లో ఉండగా విక్రమ్‌ సర్‌ ఈ కథ చెప్పారు. కథ వినంగానే వెంటనే తప్పకుండా చేస్తాను సర్‌ అని చెప్పాను. ఇంత తక్కువ టైమ్‌లో ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్‌ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాలో నా క్యారెక్టర్‌ భయపెట్టేవిధంగా ఉంటుంది. నేను సినిమాలోకి రావడానికి ఇన్స్పిరేషన్‌ అయిన నాని గారితో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం నిజంగా హ్యాపీ. నాని సర్‌, విక్రమ్‌ సర్‌ ఫ్యాన్‌గా సినిమా విడుదలకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నాను'' అన్నారు.

హీరోయిన్‌ ప్రియాంక మాట్లాడుతూ - ''నా ఫస్ట్‌ మూవీనే నాని గారితో, విక్రమ్‌ సర్‌తో అలాగే మైత్రి మూవీ మేకర్స్‌ తో కలిసి వర్క్‌ చేయడం నిజంగా చాలా హ్యాపీ. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూసే విధంగా సినిమా ఉంటుంది'' అన్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని, ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, వి.ఎఫ్‌.ఎక్స్‌.: మకుట, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.