నాని, దర్శకుడు 'హనురాఘవపూడి' ల కాంబినేషన్ లో మరో చిత్రం

  • IndiaGlitz, [Thursday,February 23 2017]

వరుసగా 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' ', 'జెంటిల్ మాన్', 'మజ్ను' 'నేను లోకల్ ' వంటి ఘన విజయం సాధించిన చిత్రాల కధానాయకుడు నాచురల్ స్టార్ నాని హీరోగా నూతన యువ నిర్మాతలు శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరువూరి సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. 'నాని' హీరోగా 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు 'హనురాఘవపూడి' ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.హీరో నాని. తన కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందనుండటం సంతోషంగా ఉందని దర్శకుడు తెలిపారు.
ఈ చిత్రానికి సుప్రసిద్ధ సంగీత దర్శకుడు 'మణిశర్మ' సంగీతం అందిస్తుండగా, ఛాయాగ్రహణం 'యువరాజ్' (కృష్ణ గాడి వీరప్రేమగాధ, ప్రస్తుతం హీరో నితిన్ హనురాఘవపూడి ల చిత్రం). చిత్రం లోని ఇతర నటీ,నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే మీడియా కు తెలియ పరచటం జరుగుతుంది. 2017 ఆగస్టు నెలలో చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చిత్ర నిర్మాతలు శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరువూరి తెలిపారు.

More News

కె.వి.రెడ్డి అవార్డు అందుకున్న క్రిష్

'యువకళావాహిని' అధ్వర్యం లో రవీంద్రభారతిలో ఫిబ్రవరి 22న కె.వి .రెడ్డి అవార్డు ప్రదానోత్సవం ఘనం గా జరిగింది .

నారా హీరోతో మూడోసారి...

బాణం చిత్రంతో తెరంగేట్రం చేసిన యంగ్ హీరో నారా రోహిత్..

చిరు, రజనీలను మించిన పవన్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..సినిమాల్లో డిఫరెంట్ క్రేజ్ ఉన్న హీరో..

దిల్ రాజు రిపీట్ చేస్తున్నాడు...

ఈ ఏడాది సంక్రాంతికి శతమానం భవతి చిత్రంతో పెద్ద సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుని మంచి లాభాలను గడించిన నిర్మాత దిల్ రాజు,

బాలయ్య 101 సినిమా టైటిల్..?

గౌతమిపుత్ర శాతకర్ఱితో తన 100వ సినిమాను పూర్తి చేసుకున్న హీరో నందమూరి బాలకృష్ణ,