కాజ‌ల్ స్థానంలో నాని హీరోయిన్‌...

  • IndiaGlitz, [Saturday,September 03 2016]

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాతో బ‌న్ని కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. సినిమా ఈ నెల నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జరుపుకోనుంది. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. దిల్ రాజు బ్యాన‌ర్‌లో రూపొంద‌నున్న 25వ సినిమా ఇది. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించ‌నుంద‌ని వార్త‌లు వచ్చాయి.

అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజ‌ల్ పేరును పరిశీలిస్తున్నారని వార్తలు వ‌చ్చాయి. అయితే బ‌న్ని స‌ర‌స‌న కొత్త హీరోయిన్ అయితే బావుంటుంద‌ని మ‌రో నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట ద‌ర్శ‌క నిర్మాత‌లు. దాంతో నానితో కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌లో న‌టించిన మెహ‌రీన్ పేరును ప‌రిశీలిస్తున్నార‌ట‌. మెహ‌రీన్ ప్ర‌స్తుతం అల్లుశిరీష్ చిత్రంలో న‌టిస్తుండ‌టం విశేషం.