close
Choose your channels

నితిన్‌కి నో చెప్పిన నాని హీరోయిన్‌!!

Monday, March 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నితిన్‌కి నో చెప్పిన నాని హీరోయిన్‌!!

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు. ఈ గ్యాప్‌లో నితిన్ మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అందులో ఒక‌టి రీమేక్ సినిమా. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, ట‌బు న‌టించిన `అంధాదున్` సినిమా పెద్ద హిట్టైన సంగ‌తి తెలిసిందే. దాని రీమేక్ హ‌క్కుల‌ను నితిన్ ద‌క్కించుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల లాంఛ‌నంగా సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. రంగ్ దే చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన త‌ర్వాత ఈ సినిమాను ట్రాక్ ఎక్కించ‌డానికి నితిన్ ప్లాన్ చేస్తున్నాడు.

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో రాధికా అప్టే పాత్ర‌కు ప్రియాంక అరుల్ మోహ‌న్‌ను సంప్ర‌దించార‌ట‌. అయితే ఆ పాత్ర‌లో న‌టించ‌డానికి ప్రియాంక అరుల్ మోహ‌న్ సింపుల్‌గా నో చెప్పేసింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అలాగే హిందీలో ట‌బు చేసిన పాత్ర‌లో న‌టింప‌చేయ‌డానికి ట‌బునే ఒప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఈ సినిమాలో నితిన్ అంధుడిగా న‌టించ‌బోతున్నాడు. నితిన్ త‌న సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్‌పై ఈ సినిమాను నిర్మించ‌బోతున్నాడు. మ‌రి హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకుంటార‌నేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.