close
Choose your channels

జాతీయ జెండా ఎగురేసిన నేచురల్ స్టార్ నాని

Thursday, August 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని పంద్రాగస్టు సందర్భంగా జాతీయ జెండా ఎగురేశారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో నాని ముఖ్య అతిథిగా పాల్గొని.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మొదటిసారి జాతీయ జెండాను ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చాక ఇంతమంది స్కూల్ పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం చూసి చాలా సంతోషం అనిపించిందన్నారు. ఈ సందర్భాన్ని చూసి తనకు స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయని.. ఆగస్టు 15 , జనవరి 26న జరిగే జెండా పండుగ అంటే చిన్నప్పుడు ఉత్సాహంగా పాల్గొనేవాడినని నాని చెప్పుకొచ్చారు.

అంతటితో ఆగని ఆయన.. ఇవాళ తాను జెండాను ఆవిష్కరిస్తానని అస్సలు ఊహించలేదుని.. మొదటిసారి జాతీయ జెండాను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా అనిపించిందన్నారు. ఇంత మంది చిన్న పిల్లల మధ్యలో... నేను కూడా చిన్నవాడినై పోతే బాగుండు అనిపించిందన్నారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలతో కలిసి నాని ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో తుమ్మల రంగారావు, రాజ శేఖర్ రెడ్డి, జెమినీ కిరణ్, ఆదిశేషగిరి రావు ,గిరి బాబు, మోహన్ ముళ్ళపూడి, కిషోర్, శివారెడ్డి, భగీరథ, కాజా సూర్యనారాయణ, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.