టీడీపీని కుదిపేస్తున్న నాని వ్యవహారం.. అసలేం జరుగుతోంది!

  • IndiaGlitz, [Thursday,June 06 2019]

విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం తెలుగుదేశం పార్టీని కుదిపేస్తోంది. రోజురోజుకు నాని ఎందుకిలా వ్యవహరిస్తున్నారో..? అసలు నాని మనసులో ఏముందో..? పార్టీ అధినేతకు సైతం అంతుపట్టని పరిస్థితి. కేశినేని అసలు తెలుగుదేశం పార్టీలో ఉంటారా..? బయటికెళ్లడానికే ఈ తతంగం అంతా నడిపిస్తున్నారా..? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే.. టీడీపీ అధినేత ఇచ్చిన లోక్‌సభ విప్ పదవి వద్దని, అందుకు తాను అర్హుడిని కాదని.. తనకు ఏ పదవి వద్దని పార్టీలోనే ఉంటానని చెప్పిన సంగతి తెలిసిందే. బుధవారం రోజున గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ జరిపిన మంతనాలు సక్సెస్ కాకపోవడంతో నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగినప్పటికీ నాని మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. దీంతో పార్టీలో అసలేం జరుగుతోంది..? పార్టీలో ఎంత మంది ఉంటారు..? ఎంత మంది జంప్ అవుతారో..? అనేది చర్చనీయాంశమైంది.

అసలేం జరుగుతోంది..!
ఫేస్‌బుక్ వేదికగా నాని చేస్తున్న పోస్ట్‌లు రెండ్రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఆయన ఫేస్‌బుక్‌లో ‘పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప..’ అని శ్రీశ్రీ అన్న మాటలు పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ వెనుక అర్థం.. పరమార్థం ఆ పెరుమాళ్లకే ఎరుక. మొదట నితిన్ గడ్కరిని నాని కలవడం.. ఆ తర్వాత చంద్రబాబుకు తనకు కీలకపదవి ఇచ్చినప్పటికీ వద్దనడం.. మరోవైపు ఆయన టీడీపీకి టాటా చెబుతారని పుకార్లు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులు గెలిచింది ముగ్గురే ముగ్గురు మాత్రమే. ఉన్నది ముగ్గురే అయినప్పటికీ వారిలో కూడా ఒకరిలో ఒకరికి సఖ్యత లేకపోవడంతో పార్టీలో అసలేం జరుగుతోంది..? అని చంద్రబాబు సైతం ఒకింత టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో నాని తన రాజకీయ భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి..!

More News

షాకింగ్ ట్విస్ట్ : వైసీపీ తరఫున రాజ్యసభకు ముద్రగడ!?

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్తారా..? వైసీపీ నుంచి ముద్రగడకు ఆహ్వానం అందిందా..?

తోట ఫ్యామిలీకి కీలక పదవి.. హామీ ఇచ్చిన జగన్!

ఇదేంటి.. తోట ఫ్యామిలీ నుంచి ఒకరు వైసీపీ నుంచి.. మరొకరు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారుగా..?

పవన్‌పై గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఫిక్స్!?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని భారీ మెజార్టీతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. టీడీపీ, జనసేన పార్టీల అడ్రస్ గల్లంతైన సంగతి తెలిసిందే.

జగన్.. తన లెఫ్ట్, రైట్‌ ఇద్దరికీ మంత్రి పదువులివ్వరా!?

వైఎస్ జగన్‌ కష్టకాలంలో ఉన్నప్పుడు తమ పదవులకు సైతం రాజీనామా చేసి ఆయన వెంట నడిచిన ఆ ఇద్దరికీ మంత్రి పదవులు లేనట్టేనా..?

సీఎం జగన్ ఈ విషయాలను అస్సలు పట్టించుకోవట్లేదేం!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో విజయకేతనం ఎగరవేసిన వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పాలనలో సంస్కరణల దిశగా అడుగులేస్తున్నారు.