close
Choose your channels

ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు

Saturday, January 12, 2019 • తెలుగు Comments

హీరో నాని నటిస్తున్న కొత్త సినిమా 'జెర్సీ'. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. పీడీవీ ప్రసాద్ సినిమాను సమర్పిస్తున్నారు. అనిరుధ్ బాణీలు అందిస్తున్నారు.

ఇందులో అర్జున్ అనే పాత్రలో క్రికెటర్‌గా సందడి చేయబోతున్నారు నాని. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 'నీ వయసు ఇప్పుడు 36 అర్జున్.

అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే వయసు..' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది.  'ఎంత ప్రయత్నించినా ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు..' అని ఓ మహిళ నానితో కోపంగా అంటోంది. 'ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు కానీ.. ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు' అంటూ నాని చివర్లో చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. అనిరుధ్ చక్కటి సంగీతం అందించినట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.