నాని 'మజ్ను' వెనక్కి వెళుతున్నాడా..?

  • IndiaGlitz, [Wednesday,September 07 2016]

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించి వ‌ర్మ‌ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న 'మ‌జ్ను' శ‌ర‌వేగంగా చిత్రీకర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, కేవా మూవీస్ బ్యాన‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ సెప్టెంబ‌ర్ 16న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే వ‌చ్చే శుక్ర‌వారం విక్ర‌మ్ ఇంకొక్క‌డు, అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్మలాకాన్వెంట్, ధ‌నుష్ రైల్ స‌హా మొత్తం 9 సినిమాలు విడుద‌ల‌వుతుండ‌టంతో ఇప్పుడు నిర్మాత‌లు సినిమాను సెప్టెంబ‌ర్ 23న విడుద‌ల చేస్తే మంచిద‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. అయితే రీసెంట్‌గా విడుద‌లైన పాట‌లు, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి. మ‌రి నిర్మాత‌లు మ‌జ్ను రిలీజ్ డేట్ విష‌యంలో అధికార‌కంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాల్సిందే.