close
Choose your channels

నాని మూవీ రిలీజ్ డేట్...

Monday, December 28, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాని హీరోగా అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాని బాల‌య్య ఫ్యాన్ గా న‌టిస్తున్నారు. అందుక‌నే ఈ సినిమాలో నాని చేతిపై జై బాల‌య్య అని టాటూ కూడా ఉంటుంది.ఈ సినిమాకి జై బాల‌య్య టైటిల్ ఫిక్స్ చేసార‌ని....కాదు బాల‌య్య పాత‌ సినిమా టైటిల్ ఫిక్స్ చేసార‌ని ప్రచారం జ‌రిగింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం...జ‌న‌వ‌రి 1న మూవీ టైటిల్ అండ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్నారు. జ‌న‌వ‌రి 10న ఆడియో లాంఛ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 5న సినిమాని రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. ఇట్స్ ఎ వెరీ ఫ్రెష్ ఎక్సైటింగ్ ల‌వ్ స్టోరి అంటూ చిత్ర యూనిట్ ఈ సినిమా పై చాలా న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి...భ‌లే మ‌గాడివోయ్ తో స‌క్సెస్ సాధించిన నాని ఈ సినిమాతో ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తాడో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.