వాయిదా పడిన నాని సినిమా?

  • IndiaGlitz, [Friday,January 19 2018]

వ‌రుస విజ‌యాల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న యువ క‌థానాయ‌కుడు నాని. తాజాగా ఎంసీఏతో మ‌రో ఘ‌న‌విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న ఈ నేచుర‌ల్ స్టార్‌.. అ! పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాలో నిత్యా మీన‌న్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, రెజీనా, ఈషా రెబ్బా, ముర‌ళీ శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల, దేవ‌ద‌ర్శిని ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. బోన్సాయ్ చెట్టు పాత్ర‌కు ర‌వితేజ‌, చేప పాత్ర‌కు నాని వాయిస్ ఓవ‌ర్ అందించారు.

ప్ర‌శాంత్ వ‌ర్మ అనే నూతన ద‌ర్శ‌కుడు ఈ చిత్రం ద్వారా డైరెక్ట‌ర్‌గా తొలి అడుగులు వేస్తున్నాడు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ సినిమాలోని ఆయా పాత్ర‌ల ఫ‌స్ట్‌లుక్స్‌, టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని ఫిబ్ర‌వ‌రి మొద‌టివారంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర యూనిట్ భావించింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాని ఫిబ్ర‌వ‌రి 16 లేదా 23కి వాయిదా వేసే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ వ‌స్తుంది.

More News

చివరి అంకంలో 'రంగస్థలం'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యూత్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగస్థలం’.

బాలకృష్ణకి ఆ పాత్ర‌లో న‌టించాల‌నుందంట‌

'జై సింహా' సినిమాతో మ‌రోసారి 'సంక్రాంతి క‌థానాయ‌కుడు' అనిపించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ చిత్రంలోని ఓ స‌న్నివేశం కోసం.. బ్రాహ్మణుల గొప్పదనం గురించి చెప్పిన బాలయ్యను బ్రాహ్మణ సంఘాలు అభినందిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. హైదరాబాదులో జరిగిన చిత్ర విజయోత్సవ సభ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ, "ఎన్టీఆర్ కుమారుడిగా పుట్టడం నా పూర్వజన్

వెంకీ సినిమాకి ముహుర్తం కుదిరింది

తాజాగా విడుద‌లైన‌ అజ్ఞాత‌వాసి సినిమాలో అతిథి పాత్ర‌లో సంద‌డి చేశారు సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్టరీ వెంకటేష్. ఇప్పుడు ఆయ‌న క‌థానాయ‌కుడిగా..  ఓ కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. దీనికి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ దర్శకత్వం వహించ‌నున్నారు.

'బగ్గిడి గోపాల్' షూటింగ్ ప్రారంభం!

బగ్గిడి ఆర్ట్ మూవీస్ పతాకంపై బగ్గిడి గోపాల్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న బయోపిక్ 'బగ్గిడి గోపాల్'.