నాని నెక్ట్స్ మూవీ రిలీజ్ డేట్...

  • IndiaGlitz, [Monday,March 20 2017]

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి'. రీసెంట్‌గా 'నిన్ను కోరి' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రీసెంట్‌గా అమెరికా షెడ్యూల్ పూర్తయ్యింది. ప్ర‌స్తుతం వైజాగ్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. వైజాగ్ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది.

నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను జూలై 11న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. నాని రీసెంట్ హిట్ నేను లోక‌ల్ త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే నెలకొన్నాయి. యు.ఎస్ ఓవ‌ర్‌సీస్ హ‌క్కులు ప్యాన్సీ రేటుకే అమ్ముడైపోయింద‌ని టాక్‌.

More News

తెలుగు సినిమా చేస్తున్న తమిళ హీరో...

తమిళంలో పిజ్జా 2 తెలుగులో విల్లా పేరుతో విడుదలైంది.ఈ సినిమాలో హీరోగా నటించిన అశోక్ సెల్వన్

'కాటమరాయుడు' కి తమిళ తంబీల సపోర్ట్....

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ఈ మార్చి 24న విడుదలకు సిద్ధమవుతుంది.

లోకేషన్స్ వేటలో కొరటాల...

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

కోటి వ్యూస్ దువ్వాడ...

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మిస్తున్న చిత్రం డిజె.దువ్వాడ జగన్నాథమ్.

పాతికేళ్ళ తర్వాత సినిమా చేస్తున్నారు...

సూపర్స్టార్ రజనీకాంత్ రోబో సీక్వెల్ `2.0` ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి సందర్బంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.