నాని చేతుల మీదుగా విడుద‌లైన ‘జయమ్మ పంచాయితీ’ నుంచి ‘తిప్పగలనా’ పాట

  • IndiaGlitz, [Tuesday,November 23 2021]

పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ ప్రస్తుతం వెండితెరపై కనిపించబోత్నారు. విలేజ్ డ్రామాగా రాబోతోన్నఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీవపాళి సందర్భంగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌కు విశేషమైన స్పందన వచ్చింది.

నేడు ఈ సినిమాలోని మొదటి పాట తిప్పగలనా? లిరికల్ వీడియోను నేచుర‌ల్ స్టార్‌ నాని విడుదల చేశారు. ఇందులో విలేజ్ వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. ఈ పాటలో సుమ ఫ్యామిలీని కూడా చూపించారు. ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీని అందించగా.. పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించారు. రామాంజనేయులు మంచి సాహిత్యాన్ని రచించారు. సంగీత ప్రియులను ఈ పాట ఆక‌ట్టుకుంటోంది. విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి.

వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా రాబోతోన్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. అనుష్ కుమార్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి కావొస్తుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించబోతోన్నారు.

నటీనటులు : సుమ కనకాల, దేవీ ప్రసాద్, దినేష్, షాలినీ తదితరులు

More News

నాగ‌చైత‌న్య పుట్టినరోజు సంద‌ర్భంగా 'థాంక్యూ'మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

న‌వ యువ సామ్రాట్ అక్కినేని నాగచైత‌న్య హీరోగా శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘థాంక్యూ’.

జగన్ మరో యూటర్న్.. శాసనమండలి రద్దు నిర్ణయం నుంచి వెనక్కి, అసెంబ్లీలో బుగ్గన తీర్మానం

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుని సంచలనం సృష్టించిన జగన్ సర్కారు…

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఫ‌స్ట్‌టైమ్‌... డైరెక్ట‌ర్ కామెంటరీతో 'జీ 5'లో ఈ 26న విడుద‌లవుతున్న 'రిప‌బ్లిక్‌'

వీక్షకులకు ఎప్పుడూ కొత్తదనం అందించడం కోసం తపనపడే ఓటీటీ వేదిక 'జీ 5'. వినోదం పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనం ఇస్తూ ఉంది.

బిగ్‌బాస్ 5 తెలుగు: కొట్టుకోబోయిన శ్రీరామ్- సన్నీ.. ఈవారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే..?

బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ 12వ వారానికి చేరుకుంది. ఇక మూడు వారాలు మాత్రమే మిగిలి వుండటంతో ఎవరు విన్నర్‌గా నిలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

అవన్నీ వదంతులే... నాన్నగారు కోలుకుంటున్నారు: తప్పుడు కథనాలపై కైకాల కుమార్తె ఆగ్రహం

దిగ్గజ నటుడు కైకాల స‌త్యనారాయ‌ణ ఆరోగ్య పరిస్థితిపై మంగ‌ళ‌వారం ఉద‌యం తెలుగు మీడియాలో ఒక్క‌సారిగా త‌ప్పుడు వార్త‌లు గుప్పుమ‌న్నాయి.