బాజీగర్ కాదంటున్ననాని..

  • IndiaGlitz, [Wednesday,June 15 2016]

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన చిత్రం జెంటిల్ మ‌న్. విభిన్న క‌థాంశంతో రూపొందిన జెంటిల్ మ‌న్ చిత్రం ఈ నెల 17న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. స‌క్సెస్ ఫుల్ మూవీస్ భ‌లే భ‌లే మ‌గాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాల త‌ర్వాత జెంటిల్ మ‌న్ చిత్రం వ‌స్తుండ‌డం, దీనికి తోడు అష్టా చ‌మ్మా కాంబినేష‌న్ కావ‌డంతో జెంటిల్ మ‌న్ సినిమా పై మంచి క్రేజ్ ఏర్ప‌డింది.
అయితే..జెంటిల్ మ‌న్ ట్రైల‌ర్ లో నాని హీరోనా, విల‌నా అనేది స‌స్పెన్స్ అంటూ ఆడియోన్స్ లో ఇంట్ర‌స్ట్ క‌లిగించారు. అయితే..ఈ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత చాలా మందికి షారుఖ్ ఖాన్ న‌టించిన బాజీగ‌ర్ సినిమా గుర్తుకువ‌చ్చింది. దీంతో బాజీగ‌ర్ సినిమాని కాపీ కొట్టారా అనే అనుమానం వ‌చ్చింది. ఇదే విష‌యం గురించి నాని ని అడిగితే...మేము కాపీ కొట్ట‌లేదు. అలాంటి వార్త‌ల‌ను న‌మ్మ‌ద్దు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ గారు ప్ర‌తి పాత్ర‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆడియోన్స్ ని ఖ‌చ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అన్నారు. మ‌రి...నాని చెప్పింది నిజ‌మో..కాదో 17న తెలుస్తుంది.