close
Choose your channels

అందులో నిజం లేద‌న్న నాని

Sunday, June 2, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అందులో నిజం లేద‌న్న నాని

`అబ్బాయిలూ అందులో నిజం లేదు` అని అన్నారు నాని. ఇంత‌కీ నాని చెప్పింది ఏ సంగ‌తి? అనేగా మీ ఆలోచ‌న‌. ఆయ‌న చేయ‌బోతున్నారంటూ వ‌స్తున్న ఓ సినిమా వార్త‌లో నిజం లేద‌ని నాని ట్విట్ట‌ర్ వేదిక‌గా చెప్పారు. ఆ సినిమా పేరు `కూచిపూడివారి వీధి`. హీరోగా నాని, ద‌ర్శ‌కుడిగా శ్రీకాంత్ అడ్డాల క‌లిసి ఈ సినిమా కోసం ప‌నిచేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే వాటిలో ఏ మాత్రం నిజం లేద‌ని నాని అన్నారు.

ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించ‌బోతున్న‌ట్టు కూడా ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. ఈ వార్త నిజం కాద‌న‌డంతో అభిమానులు కాసింత నిరాశ‌చెందిన‌ట్టు అర్థమ‌వుతోంది. పుకారుగానే వ‌చ్చిన‌ప్ప‌టికీ `కూచిపూడివారి వీధి` అనే టైటిల్ మాత్రం బావుంద‌ని, నాని ఫ‌ర్ద‌ర్‌గా ఆ టైటిల్‌ను వాడుకోవ‌చ్చ‌ని కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా కొంత‌మంది స‌ల‌హాలిచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.