యాంక‌ర్ కి షాకిచ్చిన నాని..

  • IndiaGlitz, [Friday,April 15 2016]

యువ క‌థానాయ‌కుడు నాని యాంక‌ర్ కి షాకిచ్చాడు. ఆ యాంక‌ర్ ఎవ‌రో కాదు సుమ‌. నాని సుమ‌కి షాక్ ఇవ్వ‌డం ఏమిటి..? ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగింది అనుకుంటున్నారా..? సాయిధ‌ర‌మ్ తేజ్ - రాశీ ఖ‌న్నా జంట‌గా న‌టించిన సుప్రీమ్ ఆడియో ఫంక్ష‌న్ కి నాని గెస్ట్ గా వెళ్లాడు. ఈ కార్య‌క్ర‌మానికి యాంక‌ర్ సుమ‌.

అయితే.. ఈ వేడుక‌లో నాని మాట్లాడుతూ...సుప్రీమ్ ట్రైల‌ర్ చూసిన‌ప్పుడు రెండు సార్లు విజిల్ వేయాల‌నిపించింది. ట్రైల‌ర్ లో తేజు క‌నిపించిన‌ప్పుడు చిరంజీవి గారు గుర్తుకువ‌చ్చి విజిల్ వేయాల‌నిపించింది. ఇక రెండోసారి ఎప్పుడంటే...హీరోయిన్ రాశీ ఖ‌న్నా న‌డుము క‌నిపించిన‌ప్పుడు అని చెప్పాడు. అంతే....ఏమిటీ...సింపుల్ గా జెంటిల్ మేన్ లా క‌నిపించే నాని లో ఇలాంటి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందా అంటూ సుమ షాక్ అయ్యింది. అదీ సంగ‌తి.

More News

క‌ళ్యాణ్ రామ్ కోసం హీరోయిన్ ని ఫిక్స్ చేసిన పూరి..

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్..ప్ర‌స్తుతం రోగ్ అనే సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. మ‌హాత్మ నిర్మాత సి.ఆర్.మ‌నోహార్ అన్న కొడుకు ఇషాంత్ ను రోగ్ సినిమా ద్వారా హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు.

బాలీవుడ్ మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన చ‌ర‌ణ్‌..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బాలీవుడ్ లో జంజీర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో చ‌ర‌ణ్  బాలీవుడ్లో మ‌రో మూవీ చేయ‌లేదు. అయితే రామ్ చ‌ర‌ణ్, స‌ల్మాన్ ఖాన్ తో క‌ల‌సి మ‌ల్టీస్టార‌ర్ చేయ‌నున్నార‌ని ప్ర‌చారం ప్రారంభ‌మైంది.

నాగ్ పాత్ర‌లో అమితాబ్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ క‌ల‌సి న‌టించిన చిత్రం ఊపిరి. వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన ఊపిరి చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. వీల్ ఛైర్ కూర్చికి ప‌రిమిత‌మైన పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడంటూ నాగార్జున పై సినీ విమ‌ర్శ‌కులు, సినీ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

సుప్రీమ్ ట్రైల‌ర్ సూప‌ర్..

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన చిత్రం సుప్రీమ్. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

నాని - మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి చిత్రం 'జెంటిల్‌మ‌న్‌'

'అష్టా చమ్మా' తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే.  ఈ చిత్రానికి `జెంటిల్‌మ‌న్‌` అనే పేరు పెట్టారు.