Dasara Combo: 'దసరా' కాంబో రిపీట్.. అభిమానులకు నాని సర్‌ప్రైజ్..

  • IndiaGlitz, [Saturday,March 30 2024]

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో 'దసరా' మూవీకి ఓ ప్రత్యేకత ఉంది. రూ.100కోట్లు వసూలు చేసి బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది మార్చి 30న ఈ సినిమా విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇందులో నాని ఊరమాస్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. నేటితో మూవీ విడుదలై సంవత్సరం కావడంతో నాని అభిమానులు మూవీకి సంబంధించిన సన్నివేశాలు గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఈ క్రమంలోనే నాని కూడా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. దసరా సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. “నువ్వు లీడర్ అయితే, నీకు గుర్తింపు అవసరం లేదు” అంటూ అందులో పేర్కొన్నారు. అంటే ఈ పోస్టర్ చూస్తుంటే హక్కులు కోసం పోరాడే ఒక లీడర్ కథ అని తెలుస్తుంది. దీంతో ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే నాని వరుస సినిమాలతో జోరు మీద ఉన్నారు. గతేడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో అభిమానులను అలరించాడు. 'దసరా' ఊరమాస్ మూవీ కాగా 'హాయ్ నాన్న' క్లాస్ మూవీగా ఆకట్టుకున్నాయి. ఇక వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' మూవీలో ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాగి ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ మూవీతో పాటు సుజీత్ దర్శకత్వంలో ఓ మూవీ కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే బలగం మూవీ డైరెక్టర్ వేణుతో కూడా సినిమా చేసేందుకు కమిట్ అయినట్లు సమాచారం. మొత్తానికి వరుస సినిమాలతో అభిమానులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు.

More News

Quit Jagan: 'క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ'.. ప్రజలకు చంద్రబాబు పిలుపు..

రాయలసీమలో ట్రెండ్ మారిందని.. ప్రజలు ఇక వైసీపీ బెండు తీసేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. ఎన్నికల్లో 'క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ'

Maheshwar Reddy: బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుంది: మహేశ్వర్ రెడ్డి

తమ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని టచ్ చేసినా 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ ఎవరికీ అమ్ముడుపోరని..

YS Sharmila: మహిళలకు ప్రతి నెలా రూ.8500.. ఏపీ కాంగ్రెస్ 9 గ్యారంటీలు ప్రకటన..

తాము అధికారంలోకి వస్తే 9 గ్యారంటీలను అమలు చేస్తామని ఏపీసీసీ చీఫ్‌ వైయస్ షర్మిల తెలిపారు. విజయవాడలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

Chandrababu:దళితులంటే ద్వేషం.. పేదలంటే చులకన.. మారని చంద్రబాబు వైఖరి..

దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని గతంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు.

Pawan Kalyan:మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్‌

మరో ఎంపీ అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బాలశౌరిని ఖరారుచేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.