నానితో మలయాళ ముద్దుగుమ్మ...

  • IndiaGlitz, [Thursday,February 09 2017]

సిద్దార్థ‌, శృతిహాస‌న్‌, హ‌న్సిక‌ల‌తో రూపొందిన సినిమా ఓ మై ఫ్రెండ్ అనే సినిమా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. వేణు శ్రీరాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుని ద‌ర్శ‌కుడు వేణు శ్రీరాంకు నిరాశ ఫ‌లితాన్నిచ్చింది. వేణుశ్రీరాం చాలా కాలం వ‌ర‌కు సినిమాలు లేకుండా ఖాళీగానే ఉన్నాడు.

ఇప్పుడు మ‌రో క‌థ‌ను సిద్ధం చేసి రీసెంట్‌గా నానికి వినిపించాడ‌ట‌. నానికి కూడా క‌థ న‌చ్చింద‌ని, సినిమా చేయ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా నానితో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సాయిప‌ల్ల‌వి జ‌త క‌ట్ట‌నుంద‌ని విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం. 'ప్రేమ‌మ్' ముద్దుగుమ్మ‌కు నాని సినిమా ఎలాంటి క్రేజ్ తెస్తుందో చూడాలి..

More News

సింగం తెలుగు షోలు ఆగాయి...

సూర్య, అనుష్క, శృతిహాసన్లు హీరో హీరోయిన్లుగా తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్రాజా నిర్మించిన ఈ చిత్రం `సింగం3`. ఈ సినిమాను తెలుగులో సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు.

వాటన్నింటికంటే ఉత్తమమైన కమిటీ ఇది : పరుచూరి వెంకటేశ్వరరావు

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈసీ మెంబర్ల చివరి సమావేశం మంగళవారం హైదరాబాద్ బృగవాణి రిసార్స్ట్ లో జరిగింది.

తమిళనాట పరిస్థితులపై గొంతు విప్పిన గౌతమి

ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై నటి గౌతమి గొంతు విప్పారు. తమిళ ప్రజలు జయలలితను చూసి ఓట్లేశారు. కానీ కొందరు దొడ్డిదారిలో ఆ ఓటును అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.

శ్రీను ఐ మిస్ యూ మూవీ లోగో, బ్యానర్ ,ట్రైలర్ లాంచ్

తోట మల్లికార్జున సమర్పణలో శ్రీ సూర్య నారాయణ క్రియేషన్స్ బ్యానర్ పై రాజేంద్ర ప్రసాద్ ను దర్శకుడి పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ శ్రీను ఐ మిస్ యూ . శ్రీను నిర్మిస్తున్న ఈ చిత్రం లోగో , బ్యానర్ ,ట్రైలర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.

మహా శివరాత్రి సందర్భంగా 'లక్ష్మీబాంబ్'

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్`.