నాని హీరోగా విక్ర‌మ్ కె కుమార్ దర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీస్ చిత్రం!

  • IndiaGlitz, [Sunday,December 02 2018]

నేచుర‌ల్ స్టార్ నాని 24వ సినిమాను ప్ర‌క‌టించేశారు. '13బి', 'ఇష్క్', 'మ‌నం', '24', 'హ‌లో' చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి.. సెన్సిబుల్‌, స‌క్సెస్‌ఫుల్ డైర‌క్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న విక్ర‌మ్ కె కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. 'శ్రీమంతుడు', 'జ‌న‌తా గ్యారేజ్‌', 'రంగ‌స్థలం'... వ‌రుస‌గా సెన్సేష‌న‌ల్ హిట్స్ తో హ్యాట్రిక్ అందుకున్న భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

న‌వీన్ యెర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి (సీవీఎం) ఈ సినిమాకు నిర్మాత‌లు. ఫిబ్ర‌వ‌రి 19న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకానుంది.

నేచుర‌ల్ స్టార్ నాని, విక్ర‌మ్ కె కుమార్, మైత్రీ మూవీ మేక‌ర్స్ కాంబినేష‌న్ అన‌గానే ఇటు చిత్ర‌వ‌ర్గాల్లోనూ, అటు అభిమానుల్లోనూ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా గురించి నాని ఆదివారం ట్విట్ట‌ర్‌లో ఆసక్తిక‌ర‌మైన పోస్ట్ చేశారు

నాని ట్విట్ట‌ర్ లో నేను, విక్రమ్ ఇంకా ఆ మిగతా ఐదుగురు. వచ్చే సంవత్సరం లో. గ‌ర్ల్స్!! దిస్ ఒన్స్ ఫ‌ర్ యు అని పోస్ట్ చేశారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ మ‌న నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా, స‌క్సెస్‌ఫుల్ డైర‌క్ట‌ర్ విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మా సంస్థ‌లో సినిమాను నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

విజువ‌ల్స్ తో వండ‌ర్లు చేసే పీసీ శ్రీరామ్‌గారు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టులను, సాంకేతిక నిపుణుల పేర్ల‌నును వెల్ల‌డిస్తాం. ఫిబ్ర‌వ‌రి 19 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తాం అని అన్నారు.

More News

బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ట్రైలర్ విడుదల

ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించారు.

'బ్ల‌ఫ్ మాస్ట‌ర్' రిలీజ్ డేట్‌

మనిషికి ఆశ ఉండడం సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే అనర్ధాలు జరుగుతాయి.  అత్యాశ‌ప‌రుల‌ను టార్గెట్ చేసే ఓ వ్యక్తి కథతో త‌మిళంలో తెర‌కెక్కిన చిత్రం 'చ‌తురంగ వేట్టై'.

ఓవర్సీస్ లో 'కవచం' విడుదల చేస్తున్న రెడ్ హార్ట్ మూవీస్..

బెల్లంకొండ శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ జంట‌గా న‌టించిన సినిమా క‌వ‌చం. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది.

తెలుగు రాష్ట్రాల్లో 2.0 క‌లెక్ష‌న్స్ డ్రాప్

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0'. న‌వంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు త‌మిళ, హిందీ భాష‌ల్లో గ్రాండ్ లెవ‌ల్లో

చిరు అసంతృప్తి.. సైరా వ‌చ్చే ఏడాదేనా

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నిరాశ త‌ప్పేలా లేదు. ఎందుకంటే.. ఆయ‌న 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది.