ఫ్యాన్సీ రేటుకు నాని `వి`సినిమా శాటిలైట్ హ‌క్కులు

  • IndiaGlitz, [Saturday,October 19 2019]

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న చిత్రం 'వి'. దిల్‌రాజు నిర్మాణంలో ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌కుడిగా ఈ సినిమాను తెర‌కెక్కుతుంది. క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ఫ్యాన్సీ ఆఫ‌ర్‌లో శాటిలైట్ హ‌క్కులు అమ్ముడ‌య్యాయి. వివ‌రాల ప్ర‌కారం జెమినీ టీవీ ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంద‌ట‌. అల వైకుంఠ‌పుర‌ములో, స‌రిలేరునీకెవ్వ‌రు, రూల‌ర్ చిత్రాల శాటిలైట్ హ‌క్కుల‌ను రీసెంట్‌గా సొంతం చేసుకున్న జెమినీ టీవీ రీసెంట్‌గా నాని 'వి' శాటిలైట్ హ‌క్కుల‌ను కూడా ద‌క్కించుకుంది.

నాని న‌టిస్తోన్న 25వ చిత్ర‌మిది. ఈ సినిమాలో నాని నెగ‌టివ్ రోల్‌లో న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అలాగే మ‌రో హీరో సుధీర్ బాబు ఈ చిత్రంలో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. నానిని హీరోగా తెలుగు ప‌రిచ‌యం చేసిన ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీయే కాదు.. నాని కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీ అనే చెప్పాలి. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌లకు సంబంధించిన వార్త‌ల‌పై ఓ క్లారిటీ రానుంది.

More News

రామ్ జోడిగా ఓ ప్లాప్ హీరోయిన్‌..మ‌రో హిట్ భామ‌

తొలి చిత్రం `నేల‌టిక్కెట్టు`తో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ముద్దుగుమ్మ మాళ‌వికా శ‌ర్మ‌.

దిల్‌రాజు, క్రిష్ నిర్మాణంలో అవ‌స‌రాల శ్రీనివాస్ హీరోగా `నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు` కొత్త చిత్రం

మంచి తెలుగు సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌ను అందించాల‌ని కోరుకునే నిర్మాత‌ల్లో నిర్మాత దిల్‌రాజు ముందు వ‌రుస‌లో ఉంటారు.

'భగత్ సింగ్ నగర్' ఆడియో విడుదల చేసిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్

భగత్ సింగ్ నగర్ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమం వైజాగ్ లో వి.ఎమ్.ఆర్.డి.ఎ చిల్డర్న్స్ అరినలో జరిగింది.

పురంధేశ్వరి‌కి జగన్ బంపరాఫర్‌..  కీలక పదవి!

ఏపీ సీఎం వైఎస్ జగన్.. బీజేపీ మహిళ నేత పురంధేశ్వరికి బంపరాఫర్ ఇచ్చారా..? ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకుంటే సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారా..?

భార‌తీయుడు 2: ఓ యాక్ష‌న్ స‌న్నివేశం కోసం క‌ళ్లు చెదిరే బ‌డ్జెట్‌

శంక‌ర్ అంటేనే గ్రాండియ‌ర్‌. ప్ర‌తి సీన్‌ను తెర‌పై ఆయ‌న ఓ అద్భుతంగా ఆవిష్క‌రించాల‌ని ప్ర‌య‌త్నాలు చే్స్తుంటారు.