Download App

వెలుగులోకి మరో స్వామిజి రాసలీలల బాగోతం

బెంగుళూరు లో ఉన్న ఓ మఠంలో స్వామిజీ రాసలీలల వీడియో ఒకటి గురువారం వెలుగులోకి వచ్చింది.

మద్దేవణపుర మఠంలోని బెడ్ రూంలో నటితో నంజేశ్వర స్వామిజీ అలియాస్‌ దయానంద్‌ స్వామీజీ రాసలీలలు జరుపుతున్న సమయంలో రహస్యంగా వీడియో తీసి విడుదల చేశారు. ఆ నటి వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఈ విషయం బయటకు రావడం తో ట్రస్ట్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా,  దయానంద అలియాస్ నంజేశ్వర స్వామీజీ వెంటనే మఠం ఖాళీ చేసి వెళ్లిపోవాలని భక్తులు ఆందోళనకు దిగారు.

ఇప్పటికే మఠానికి సంబంధించి భూముల అవకతవకల్లో ఈ స్వామిజి హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

బెంగళూరులోని హుణసమారణహళ్ళిలో ఉన్న మద్దేవణపుర మఠం 500 ఏళ్ళ చరిత్ర కలిగి ఉంది. పర్వతరాజ్‌ శివాచార్య స్వామి నుంచి వారసత్వంగా బాధ్యతలు తీసుకున్న తనయుడు నంజేశ్వర స్వామిజీగా ప్రస్తుతం మఠ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.