close
Choose your channels

కూల్ బ్రో చిల్.. అంటున్న మంత్రి నారా లోకేశ్!

Wednesday, January 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టైటిల్ చూడగానే జబర్దస్త్ యోధా.. 'చిల్ బేబీ.. సెల్ఫీ' అనే డైలాగ్ గుర్తొచ్చింది కదూ.. అవును అది యోధా రీల్ డైలాగ్ అయితే.. మంత్రి నారా లోకేశ్ మాత్రం రియల్ లైఫ్‌‌లో 'కూల్ బ్రో చిల్' అంటున్నారు.! మనమంతా ఒక్కటి బ్రో.. గతం గత:.. మనమంతా కుర్రాళ్లం ముందుచూపు ఉండాలి మీరు ఇలా చేస్తే ఎలా అంటూ చినబాబు రంగంలోకి దిగారు. అసలు ఈ బ్రో వ్యవహారమేంటి.. చినబాబు రంగంలోకి దిగడమేంటని అనుకుంటున్నారా..? ఇక లేటెందుకు చకచకా ఈ స్టోరీ చదివేయండి మీకే ఓ క్లారిటీ వచ్చేస్తుంది.

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి ఫ్యామిలీ వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి 21న వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో కండువా కప్పుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్త ఈ నోటా.. ఆ నోటా పడి మంత్రి లోకేశ్‌‌‌కు చెవినపడటంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన సైన్యంతో రంగంలోకి దిగారట. స్వయానా తన తల్లి సోదరి అయిన పురందేశ్వరి కుమారుడు హితేశ్ చెంచురామ్‌‌కు ఫోన్ చేసి "సడన్‌ ఎందుకిలా చేస్తున్నారు బ్రో.. మనమంతా ఎన్టీఆర్ మనవళ్లం అనే విషయం మరిచిపోయారా..? మన బద్ధశత్రువు, మన రాజకీయ ప్రత్యర్థి పార్టీలో మీరు చేరడమేంటి..? మన కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది కానీ వ్యక్తికతంగా కాదు మనమంతా ఒక్కటే..? ఇవాళ కాకపోయినా రేపయినా మంచి రోజులొస్తాయ్.. దీనికే ప్రత్యర్థి పంచకు చేరాలనుకోవడమేంటి?" అని మాట్లాడినట్లు తెలుస్తోంది.

సంక్రాంతి తర్వాత అవసరమైతే ఒకసారి కలుద్దామని.. ఇప్పుడు మా వాళ్లు వస్తారు మాట్లాడండి అని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఇద్దరు కీలక నేతలను దగ్గుబాటి ఇంటికి పంపాలని లోకేశ్ నిర్ణయించారట. అయితే దగ్గుబాటిపై టీడీపీ అనుకూల పత్రికలు, టీవీ చానెళ్లలో రోజుకో కథనం వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీని ఒప్పించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే లోకేశ్‌‌ ఫోన్ కాల్‌‌తో హితేశ్ ఏమైనా వ్యవహారం నడుపుతారా..? లేకుంటే ఒకసారి బ్లైండ్ ఫిక్స్‌‌ అయ్యాం కాబట్టి ఇక వెనకడుగేసేదే లేదని ఈ నెల 21న వైసీపీలో చేరతారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.