లోకేశ్‌ ఘోర పరాజయం.. ఆర్కే ఘన విజయం

  • IndiaGlitz, [Friday,May 24 2019]

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఘోర పరాజయం చవిచూశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకర్గం నుంచి పోటీచేసిన నారా లోకేశ్, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తలపడి ఓడారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నిరాశే మిగిలింది.

ఆర్కే చేతిలో లోకేశ్ ఘోరంగా ఓడిపోయారు. లోకేశ్‌పై 5,200 ఓట్ల తేడాతో ఆర్కే ఘన విజయం సాధించారు. కాగా.. ఈ మంగళగిరి నుంచి రెండోసారి వరుసగా ఆర్కే విజయం సాధించారు.

ఎమ్మెల్సీగా మంత్రి అయిన నారా లోకేశ్ తొలిసారి.. ఎమ్మెల్యేగా పోటీచేసి ఆర్కే చేతిలో ఓటమిపాలయ్యారు. కాగా.. మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 200కోట్లకు పైగా ఖర్చుచేశారని.. పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ ఓట్లు మాత్రం రాలేదు.

అంతేకాదు ఇంటికి కూలర్, ఏసీ, టీవీ ఇలా అడిగిందల్లా ఇచ్చారని సమాచారం. అయినప్పటికీ లోకల్ లీడర్, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే.. ఆర్కేనే మంగళగిరి ప్రజలు గెలిపించారు. అయితే ఆర్కేకు వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.

More News

నేను ఐరెన్‌లెగ్ కాదు.. గోల్డెన్ లెగ్!

"ఐరన్‌లెగ్‌ .. రోజా గెలిస్తే జగన్‌ సీఎం కాలేరని విమర్శించిన వారందరికీ నా విజయం చెంపపెట్టు.. నాది గోల్డెన్‌ లెగ్‌.. నేను ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తాను" అని వైసీపీ

ఏపీకి ప్రామిసింగ్ లీడర్ జగన్ సీఎంగా వచ్చారు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు, రాజకీయ-సినీ ప్రముఖులు వైస్ జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు.

మే-30న సీఎంగా జగన్ ప్రమాణం.. మొదటి సంతకం..!

ఆంధప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని స్థానాలు దక్కించుకున్న వైసీపీ మరో వారం రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ జగన్ మొట్ట మొదటిసారిగా మీడియాతో మాట్లాడారు.

'యాత్ర 2' చేస్తారా?

వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం 'యాత్ర‌'. మ‌హి వి.రాఘ‌వ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. మ‌మ్ముట్టి ఈ చిత్రం తెర‌కెక్కింది.

సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఊహించని రీతిలో ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కనివీనీ ఎరుగని రీతిలో ఫ్యాన్ గాలి వీచింది.