కోటంరెడ్డికి లోకేష్ ప్రశంసలు


Send us your feedback to audioarticles@vaarta.com


నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి నారా లోకేష్ మెచ్చుకున్నారు. ఒకేసారి 105 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి రికార్డ్ సృష్టించారు కోటంరెడ్డి. ఈ ఘనతను లోకేష్ మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. ట్విట్టర్ వేదికగా కోటంరెడ్డికి శుభాకాంక్షలు అందించారు.
కూటమి ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధికి కట్టుబడి ఉందని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చూపించిన చొరవ దానికి ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. అటు కోటంరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో అభివృద్ధి పూర్తిగా కుటుంపడిందన్నారు.
మరీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ లో కనీసం రోడ్లు కూడా లేవని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో, నెల్లూరు రూరల్ లోని ప్రతి కాలనీకి రోడ్లు వేస్తామని కోటంరెడ్డి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 191 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్టు ఆయన వెల్లడించారు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని, తాజాగా శంకుస్థాపన చేసిన పనుల్ని 60 రోజుల్లో పూర్తిచేస్తామని అన్నారు కోటంరెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments