రాజకుమారి కోసం రఫ్ లుక్ తో రోహిత్!

  • IndiaGlitz, [Tuesday,February 14 2017]

వైవిధ్యమైన కథలను ఎంచుకొంటూ యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకొన్న నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం "కథలో రాజకుమారి". శ్రీహాస్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు అరణ్ మీడియా వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నేడు (ఫిబ్రవరి 14) విడుదల చేశారు. మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రశాంతి, సౌందర్య నర్రా, కృష్ణ విజయ్ నిర్మాతలు. నారా రోహిత్ తోపాటు నాగశౌర్య మరో ముఖ్యపాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రధారి.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ""జ్యో అచ్యుతానంద" అనంతరం నారా రోహిత్-నాగశౌర్యలు కలిసి నటిస్తున్న సినిమా ఇది. నారా రోహిత్ రఫ్ లుక్ తో విడుదల చేసిన పోస్టర్, మోషన్ పోస్టర్ కి మంచి స్పందన లభిస్తోంది. నారా రోహిత్ చాలా వైవిధ్యమైన క్యారెక్టరైజేషన్ లో ఈ సినిమాలో కనిపించనున్నారు. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆడియో మరియు ట్రైలర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అతి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. మహేష్ సూరపనేని ఈ చిత్రంలో రోహిత్ వేషధారణను తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అలాగే ఆయన "కథలో రాజకుమారి" చిత్రాన్ని తెరకెక్కించిన విధానం కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది" అన్నారు.
నమిత ప్రమోద్, అజయ్, ప్రభాస్ శ్రీను, కోట శ్రీనివాసరావు, రాజీవ్ కనకాల, మురళీమోహన్, చలపతిరావు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నరేష్ కె.రాణా, సంగీతం: ఇళయరాజా-విశాల్ చంద్రశేఖర్, కళ: సాహి సురేష్, ఫైట్స్: వెంకీ, లిరిక్స్: కృష్ణ చైతన్య, కెకె.బాలాజీ, అడిషనల్ డైలాగ్స్: రాజ్ కుమార్ వెలిసెల, కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్వం: మహేష్ సూరపనేని, సమర్పణ: రాజేష్ వర్మ సిరువూరి, నిర్మాతలు: ప్రశాంతి, సౌందర్య నర్రా, కృష్ణ విజయ్!

More News

ఈ నెల 24న 'విన్నర్' రిలీజ్

పులికి ఎదురెళ్ళే ధైర్యం...పాతికమందిని మట్టుబెట్టే బలం...గడ్డిపోచగా తీసిపారేసే వాళ్ల గుండెల్లో గడ్డపారలా దిగే తెగువ... ఆకుర్రాడి సొంతం.ఏ పరిస్థితుల్లోనైనా గెలుపే లక్ష్యంగా పోరాడడం...

చివరి షెడ్యూల్ షూటింగ్ లో నాగ అన్వేష్ 'ఏంజెల్'

మన్యంపులి వంటి సూపర్ హిట్ తరువాత ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణా రెడ్డి పర్యవేక్షణలో శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బాపటేల్ జంటగా తెరకెక్కుతోన్న సినిమా ఏంజిల్.

శంషాబాద్ వద్ద భారీ సెట్ లో 'బెవర్స్' ఫైట్ చిత్రీకరణ

ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు,ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవర్స్ చిత్రం మూడవ షెడ్యూల్

హార్వర్డ్ యూనివర్శిటీలో పవన్ కీలకోపన్యాసం

జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తన అమెరికా పర్యటనలో చిట్టచివరిదీ… కీలకమైన ప్రసంగంతో మరోసారి ఆకట్టుకున్నారు. హార్వర్డ్ యూనివర్శిటీ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ ప్రసంగించేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ భారత కాలమానం ప్రకారం

ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న సునీల్ - శంకర్ ల సినిమా!

సునీల్ కథానాయకుడిగా ఎన్.శంకర్ దర్శకత్వంలో మలయాళం హిట్ సినిమా "2కంట్రీస్"కు