అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు చిత్రంలో రోహిత్ హీరో కాడా....?

  • IndiaGlitz, [Wednesday,September 14 2016]

నారా రోహిత్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర‌న్ మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై విభిన్న చిత్రాల క‌థానాయ‌కుడు నారా రోహిత్, ప్రేమ ఇష్క్ కాద‌ల్ చిత్రంలో రాయ‌ల్‌రాజు పాత్ర‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన శ్రీవిష్ణు క‌థానాయ‌కులుగా నిర్మించ‌బ‌డుతున్న చిత్రం 'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు'.ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది..

అదేంటంటే ఈ చిత్రంలో నారారోహిత్ హీరో పాత్ర కాద‌ని, శ్రీ విష్ణుయే హీరో పాత్ర చేస్తున్నాడ‌ని. సినిమా ఓ పోలీస్, దొంగ మ‌ధ్య జ‌రిగే సినిమా. ఇందులో దొంగ‌గా శ్రీ విష్ణు న‌టిస్తే, పోలీస్ పాత్ర‌లో నారారోహిత్ న‌టించాడ‌ట‌. దొంగ‌ను ప‌ట్టుకోవ‌డానికి నారారోహిత్ స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా అప్పాయింట్ చేయ‌బ‌డతాడ‌ట‌. వారి మ‌ధ్య న‌డిచే క‌థే అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంతర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఇది నిజ‌మైతే...హీరోగానే కాకుండా డిఫ‌రెంట్ పాత్ర‌ల‌ను చేస్తున్న నారారోహిత్‌ను అభినందించాల్సిందే మ‌రి...

More News

మా అబ్బాయి రోష‌న్ నాకంటే మంచి స్ధాయికి వెళ‌తాడు అనేది నా న‌మ్మ‌కం - శ్రీకాంత్

శ్రీకాంత్ - ఊహ‌ల ముద్దుల త‌న‌యుడు రోష‌న్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం నిర్మ‌లా కాన్వెంట్. ఈ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని నాగార్జున‌, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు.

బిచ్చ‌గాడు హీరోయిన్ పెళ్లి - ఫిర్యాదు చేసిన త‌ల్లి..!

సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా నటించిన తమిళ సినిమా పిచ్చైకారన్. ఈ చిత్రం తెలుగు లో బిచ్చగాడు టైటిల్ తో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

పెళ్లి చూపులు డైరెక్ట‌ర్ తో నాగ్ మూవీ..!

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం పెళ్లి చూపులు. చిన్న చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే.

విశాల్‌, కార్తీల‌పై రాధికా ఫైర్‌

న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లో శ‌ర‌త్‌కుమార్ అండ్ టీంపై నాజ‌ర్ అండ్ విశాల్, కార్తీ టీం విజ‌యం సాధించిన‌ప్ప‌టి నుండి ఇద్ద‌రి మ‌ధ్య అడ‌పా ద‌డ‌పా మాట‌ల యుద్ధం జ‌రుగుతూనే ఉంది.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో జయమ్ము నిశ్చయమ్మురా..!

"గీతాంజలి" తర్వాత శ్రీనివాస్ రెడ్డి-  "రాజు గారి గది" తర్వాత పూర్ణ జంటగా నటిస్తున్న నేటివిటీ హాస్యభరిత చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా". తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంలో ఉన్న రోజుల్ని గుర్తుకు తెస్తూ..