close
Choose your channels

కరోనా ఎఫెక్ట్.. తమిళనాడు షెడ్యూల్ పూర్తి చేసిన ‘నార‌ప్ప‌’

Wednesday, March 18, 2020 • తెలుగు Comments

కరోనా ఎఫెక్ట్.. తమిళనాడు షెడ్యూల్ పూర్తి చేసిన ‘నార‌ప్ప‌’

'ఎఫ్‌2', 'వెంకీమామ' వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ 74వ చిత్రం 'నారప్ప'. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన 'అసురన్‌' చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా సినిమాల షూటింగ్స్ ఆగిపోతున్నాయి. అయితే నార‌ప్ప యూనిట్ మాత్రం ఇటీవ‌ల త‌మిళ‌నాడుతిరుచందూర్ సమీపంలో ఉన్న తెరికాడు ప్రదేశంలో నారప్ప యాక్షన్ సీక్వెన్స్ స‌హా కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రణ పూర్తి చేసేసి హైద‌రాబాద్ తిరిగొచ్చారు.

ఇక చివ‌రి షెడ్యూల్‌ను మాత్రం క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గు ముఖం ప‌ట్టాక చిత్రీక‌రించాల‌నుకుంటున్నార‌ట‌. ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్ఉంటారు. అందులో ఒక‌రు ప్రియ‌మ‌ణి న‌టిస్తుండ‌గా.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో మ‌ల‌యాళ బ్యూటీ రెబా జాన్ నటిస్తుంద‌ట‌. ముందుగా ఈ చిత్రాన్ని వేస‌విలో విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. మ‌రిప్పుడు క‌రోనా ప్రభావంతో విడుద‌ల్లో జాప్య‌మేదైనా జ‌రుగుతుందేమో చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz