Narayana & Co:సుధాకర్ కోమాకుల 'నారాయణ & కో' ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Friday,March 24 2023]

యంగ్ హీరో సుధాకర్ కోమాకుల ప్రస్తుతం చిన్న పాపిశెట్టి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్ , సుఖ మీడియా బ్యానర్‌లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈరోజు ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘నారాయణ & కో’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ హీరో, అతని కుటుంబాన్ని పరిచయం చేస్తుంది. “'ఎక్స్ పీరియన్స్ ది తిక్కల్ ఫ్యామిలీ' అని పోస్టర్ పై వుండటం ఇంట్రస్టింగా వుంది. ఇది ఒక విలక్షణమైన కుటుంబం, ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అందరూ పగలబడినవ్వుతూ కనిపించారు. ఆమని, దేవి ప్రసాద్ ఇద్దరు అబ్బాయిల తల్లిదండ్రులుగా నటించారు. నారాయణ & కో హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు.

జై కృష్ణ, పూజా కిరణ్, ఆరతి పొడి, యామిని బి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమౌతోంది.

సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల, నాగ వంశీ త్రయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, సిద్దం మనోహర్ అడిషినల్ సినిమాటోగ్రఫీ అందించారు. కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. రవితేజ జి ఈ చిత్రానికి కథను అందించగా, రాజీవ్ కె డైలాగ్ రైటర్. సృజన అడుసుమిల్లి ఎడిటర్. శ్రీనివాస్ గొర్రిపూడి సహ నిర్మాత, రవి దొండపాటి ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: సుధాకర్ కోమాకుల, దేవి ప్రసాద్, ఆమని, జై కృష్ణ, పూజ కిరణ్, ఆరతి పొడి, యామిని బండారు, సప్తగిరి, అలీ రెజా, శివ రామచంద్రపు, తోటపల్లి మధు, రాగిణి, అనంత్, తదితరులు.

More News

Naresh, Pavithra:షాకిచ్చిన నరేష్ - పవిత్రా లోకేష్ : అది నిజం పెళ్లి కాదు, అంతా ‘‘మళ్లీపెళ్లి’’ కోసమే...!!

సీనియర్ నటుడు వీకే నరేష్, కన్నట నటి పవిత్రా లోకేష్‌లు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.

Vishnu VS Manoj:బంధువును కొట్టిన మంచు విష్ణు.. ‘ఇళ్లలోకి చొరబడి కొడుతూ వుంటాడు’ అంటూ వీడియో పెట్టిన మనోజ్

కుటుంబం అన్నాకా.. భార్యాభర్తలు, అన్నదమ్ములు, తోడికోడళ్లు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు సహజం.

Brahmanandam:బ్రహ్మానందాన్ని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ప్రతిభను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎల్లప్పుడూ ముందుంటారు. మంచి సినిమాకు ఆయన అండదండలు, ప్రశంసలు ఎప్పుడూ ఉంటాయి.

NTR30:ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో మూవీ NTR 30 గ్రాండ్ లాంచ్‌..

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ NTR 30.

Khushi:విజయ్ దేవరకొండ, సమంత ఖుషీ సెప్టెంబర్ 1న విడుదల

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ, మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ సమంత కాంబినేషన్ లో