నరేంద్ర మోది.. వెబ్‌సిరీస్
Send us your feedback to audioarticles@vaarta.com
భారత ప్రధాని నరేంద్ర మోది జీవితాన్ని `పిఎం నరేంద్రమోది` చిత్రంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. వివేక్ ఒబెరాయ్ సినిమాలో టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు వెండితెరపైనే కాకుండా డిజిటల్ మాధ్యమంలో కూడా నరేంద్ర మోది జీవితగాథ తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలై గుజరాత్లో చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఈరోస్ వెబ్ స్ట్రీమింగ్ యాప్‌లో తొమ్మిది భాగాల బయోపిక్ సిరీస్ ప్రదర్శితం కానుంది. ఓ మైగాడ్, 102 నాటౌట్ చిత్రాల దర్శకుడు ఉమేష్ శుక్తా ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. అందరూ కొత్త నటీనటులే నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో టీవీ నటుడు మహేష్ ఠాకూర్‌ను మోదిగా నటింప చేస్తున్నారు. ఇమార్చి 15కంతా షూటింగ్ పూర్తి చేస్తామని దర్శకుడు ఉమేష్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.