షాకింగ్.. బాబు గుట్టును మోదీ రట్టుచేస్తారా!?

  • IndiaGlitz, [Sunday,February 10 2019]

ఆంధ్రప్రదేశ్‌‌ విభజించినప్పుడు పోటాపోటీగా మేం ఇంతిస్తాం... అంతిస్తాం అంటూ అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ పోటాపోటీగా చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. మరీ ముఖ్యంగా 2014 ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ప్రధాని మోదీ ఏపీలో పర్యటిస్తూ అన్ని హామీలు నెరవేరుస్తా.. ప్రత్యేక హోదా ఇస్తానంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. మరోవైపు వెంకయ్య నాయుడు కూడా ఒకట్రెండు కాదు 15 ఏళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు.. కాబట్టి వెంకయ్య విషయం ఇక్కడ అప్రస్తుతం. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోదీ మట్టి, నీళ్లు తెచ్చి వాటితో సరిపెట్టేసుకున్నారు. ఆ తర్వాత ప్యాకేజీ ప్రకటించడం.. బాబు ఆహ్వానించడం.. మళ్లీ బాబు యూటర్న్ తీసుకోవడం ఈ ఘటనలన్నీ ఆంధ్రప్రజలు గుర్తుపెట్టుకునే ఉంటారు.. ఎవరూ మరిపోరు కూడా. అయితే ఆ తర్వాత కేంద్రంపై తిరుగుబాటు చేసి ఎన్డీఏ నుంచి బయటికొచ్చి పార్లమెంట్ వేదికగా ఎంపీలతో.. ఏపీ వ్యాప్తంగా ధర్మపోరాట దీక్షలతో చంద్రబాబు చెలరేగిపోయారు.

మోదీ వస్తే పరిస్థితి ఇలా ఉంటుందేమో!

సౌత్‌‌లో పట్టు సంపాదించుకోవాలని తహతహలాడుతున్న కమలనాథులు గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో జతకట్టి కొన్ని సీట్టు దక్కించుకుంది. అయితే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావడం.. హామీలపై పోరాటం చేస్తుండటంతో అసలు ఏపీ ప్రజలకు, సీఎం చంద్రబాబుకు ఏం సమాధానం చెప్పాలో కూడా మోదీకి అర్థం కాని పరిస్థితి. ఈ తరుణంలో 2019 ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏపీ పర్యటనకు మోదీ సిద్ధమయ్యారు. అయితే మోదీ ఏపీకి ఏ మొహం పెట్టుకుని వస్తారు..? అసలు ఆయనకు సిగ్గుందా..? ఏపీకి రానీ ఆంధ్రోళ్ల అంటే ఏంటో చూపిస్తామంటూ ప్రజలు, నేతలు కన్నెర్రజేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ‘మోదీ నో ఎంట్రీ’ అంటూ ఏపీ వ్యాప్తంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఇప్పటికే పలుమార్లు ఏపీ పర్యటన వాయిదా వేసుకున్న మోదీ ఈసారి అయినా వస్తారా..? రారా అన్నది ప్రశ్నార్థకమే.

ఢిల్లీ నుంచి ఏపీకి ఏం తెస్తారు..!?

ఏపీ ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న మోదీ ఏపీకి వస్తే ఏం తెస్తారు..? ఇదివరకే రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ చెప్పినట్లుగా వరాల జల్లు కురిపించబోతున్నారా..? తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న ఏపీ ప్రజలను చల్లబరిచి శుభవార్త చెబుతారా..? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒక వేళ ఏపీపై వరాలు కురిపిస్తే ఏమేం శుభవార్తలు చెబుతారు..? ఆ వరాలను ఏపీ ప్రజలు ఆహ్వానిస్తారా..? తిరస్కరిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు ఏపీ ప్రజలు ఉప్పొంగిపోయే గిఫ్ట్ ఇస్తారని టాక్ నడుస్తోంది. అయితే అదేంటో తెలియాలంటే సోమవారం వరకు వేచి చూడాల్సిందే.

బాబు బండారం బయటపెడతారా..!?

ఇప్పటికే మోదీ- చంద్రబాబు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. చంద్రబాబు రోజుకు పదిసార్లయినా మోదీ గురించి మాట్లాడుతుంటారు. మరోవైపు మోదీ సైతం అప్పుడప్పుడు చిన్నపాటి విమర్శలతో సరిపెట్టుకుంటున్నారు. అయితే మోదీ తాజా పర్యటనలో ఆయన ఏం చెప్పబోతున్నారు..? చంద్రబాబు సీక్రెట్స్.. కేంద్రం నుంచి ఏపీకి వచ్చిన నిధుల లెక్కలన్నీ బయటపెట్టి బాబు ఇరకాటున పెడతారా..? లేకుంటే సడన్ షాక్‌‌తో కోలుకులేని దెబ్బ కొట్టనున్నారా..? అనేది తెలియాల్సి ఉంది. అయితే తామిచ్చిన నిధులపై లెక్కలు తేల్చి పంపండని ఇప్పటికే పలుమార్లు కేంద్రం కోరినప్పటికీ ఏపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ విషయంపై కూడా మోదీ మాట్లాడతారని టాక్.

షా అట్టర్ ప్లాప్.. మరి మోదీ సంగతేంటో..!?

బీజేపీ జాతీయాధ్యక్షులు అమిత్ షా ఇటీవలే ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించారు. ఈ సభకు ఎవరూ జనాల రాక ఖాళీ కుర్చీలన్నీ నిలబడ్డాయి. అయితే మోదీ సభకు కూడా ఇలానే రిపిట్ అవుతుందా..? జనాల కోసం ఏపీ కమలనాథులు ఏమైనా జిమ్మిక్కలు చేసి సభకు తీసుకొస్తారా..? లేదా అనేది డౌటే. పైగా ఎక్కడ చూసిన ధర్నాలు.. దీక్షలే ఇటువంటి తరుణంలో మోదీ సభ ప్రాంగణం దాకా వస్తారా..? లేకుంటే నినాదాలు, బ్యానర్లు, విమర్శలు చూసి గో బ్యాక్ అంటారా అనేది తెలియాల్సి ఉంది.

మోదీ, బాబు ఇద్దరిలో ఎవరు సక్సెస్ అవుతారో..!?

కాగా ఒకే రోజు మోదీ ఏపీలో.. ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు పూనుకున్నారు. అయితే మోదీ వచ్చే రోజే ఢిల్లీలో ఎందుకు దీక్ష చేస్తున్నారు..? ఇప్పటికే పలు కీలక సందర్భాల్లో (కోడికత్తి కేసు, )ఏపీలో కాకుండా చంద్రబాబు ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉండటం చూసి అందరూ జనాలంతా సమ్‌ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఢిల్లీకి చంద్రబాబు వెళ్తున్నారు..? అది కూడా మోదీ లేని టైమ్‌‌లో దేశ రాజధానిలో చంద్రబాబు దీక్షకు ఎందుకు చేస్తున్నారు..? మరీ ముఖ్యంగా చంద్రబాబు.. మోదీ ఇద్దరిలో ఎవరి సభ సక్సెస్ అవుతుంది..? అనేది సోమవారం తెలుస్తుంది.

మొత్తానికి చూస్తే.. ఏపీలో సోమవారం నాడు కార్యక్రమాలు రసవత్తరంగా జరగనున్నాయ్. అయితే ఏపీకి వస్తున్న మోదీ ఏం ఇవ్వబోతున్నారు..? శుభవార్త చెప్పి ఏపీ ప్రజలను చల్లబరుస్తారా..? లేకుంటే యథావిథిగా పాత స్క్రిప్టే చదువుతురా అనేది సోమవారంతో తేలిపోనుంది.

More News

మహేశ్ పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడుతూ దణ్ణం పెట్టిన నమ్రత

టాలీవుడ్ సూపర్‌‌స్టార్ మహేశ్ బాబు త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారు..?  ‘భరత్ అనే నేను’ సినిమాలో సీఎంగా చేసిన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు..?

రామ్ ఫ్యాన్స్ నన్ను చంపొద్దండి..!: నటి చార్మీ

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ షురూ చేయడం జరిగింది.

పోలీస్‌ వ్యవస్థ, చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌‌లో వ్యవస్థలను సీఎం చంద్రబాబు సర్కార్ భ్రష్టుపట్టించిందని వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు.

లోకేశ్ సభలో జగన్ స్టికర్లు.. కంగుతిన్న తమ్ముళ్లు!

ఆంధ్రప్రదేశ్ ‌‌వ్యాప్తంగా శనివారం రోజున ‘ఎన్టీఆర్ గృహకల్ప పథకం’లో భాగంగా లబ్ధిదారులకు ఇళ్ల అందజేయడం జరిగింది.

ఈ నెల 11న 'నాగకన్య' టీజర్ లాంచ్

వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరోగా నటిస్తున్నారు.