నేనేంటో చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. నాగబాబుపై నరేష్ కామెంట్స్

'మా' ఎన్నికల్లో విమర్శలకు తావు లేదంటూనే ఒకరిపై ఒకరు పరోక్షంగా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. సెప్టెంబర్ లో జరగబోయే మా ఎన్నకలకు అప్పుడే ప్రెస్ మీట్లు, కౌంటర్ ప్రెస్ మీట్స్ మొదలైపోయాయి. శుక్రవారం ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో మీడియా సమావేశం నిర్వహించారు.

ఇదీ చదవండి: ఒక్క మామిడి కాయ ధర రూ.21 వేలు.. 9 శునకాలు, 3 గార్డ్స్ తో తోటకు కాపలా!

ప్రెస్ మీట్ కి కౌంటర్ గా శనివారం నరేష్ మీడియా సమావేశంతో ముందుకు వచ్చారు. ఈ మీడియా సమావేశంలో నరేష్ తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇస్తూనే ప్రకాష్ రాజ్, నాగబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం ప్రెస్ మీట్ లో నాగబాబు చేసిన వ్యాఖ్యలు తనని బాధించాయి అని నరేష్ అన్నారు. తాను అధ్యక్షుడిగా చేపట్టిన కార్యక్రమాలన్నీ చిరంజీవి, నాగబాబులకు వివరించాయి. అయినప్పటికీ నాగబాబు 'మా' మసకబారిపోయింది అని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యాఖ్యలు సరికాదు అని నరేష్ అన్నారు. నాగబాబు నాకు మంచి మిత్రులు. ఆయనతో చాలా సార్లు కలసి పనిచేశాను అని నరేష్ అన్నారు.

నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను సినిమా వాడిని. సినిమా బిడ్డని అని నరేష్ అన్నారు. ప్రకాష్ రాజ్ కూడా నాకు మంచి మిత్రుడు. మూడు నెలల క్రితమే 'మా' ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు నాకు చెప్పారు. తెలుగు సినిమాల్లో నటించే వారు ఎవరైనా పోటీ చేయవచ్చు అని చెప్పాను. అలాగే నరేష్ మంచు విష్ణుని కూడా ప్రశంసించారు. విష్ణు ఇండస్ట్రీ బిడ్డ. కష్టనష్టాలు చూడకుండా సినిమాలు చేస్తూ చాలా మందికి అన్నం పెడుతున్నాడు అని ప్రశంసించారు.

More News

ప్రకృతి ఒడిలో లావణ్య త్రిపాఠి కేఫ్ నిర్మాణం. ఆమె ప్లాన్ ఏంటంటే!

అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు.

ఓ డైరెక్టర్ నా క్లీవేజ్ చూడాలన్నాడు.. మరొకడు ఏకంగా..

బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకున్న సుర్వీన్ చావ్లా ఆ తర్వాత వెండితెరపై కూడా మెరిసింది.

ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు!

ప్రముఖ ఫిలిం క్రిటిక్, నటుడు కత్తి మహేష్ ప్రమాదానికి గురయ్యారు.

డైరెక్ట్ ఓటిటి రిలీజ్.. హాట్ స్టార్ తో నితిన్ ఫ్యాన్సీ డీల్ ?

యూత్ స్టార్ నితిన్ నుంచి ఈ ఏడాది ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి.

ఒక్క మామిడి కాయ ధర రూ.21 వేలు.. 9 శునకాలు, 3 గార్డ్స్ తో తోటకు కాపలా!

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. మధ్యప్రదేశ్, జబల్పూర్ కి చెందిన సంకల్ప్ సింగ్ పరిహర్ అనే రైతు తన మామిడి తోటకు 9 జర్మన్ షిపార్డ్ కుక్కలు,