పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న నరుడా...డోనరుడా...!

  • IndiaGlitz, [Wednesday,October 05 2016]

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..! డోన‌రుడా..!. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ‌, సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో రాని వీర్య‌దానం అనే కాన్సెప్ట్‌తో సినిమా రూపొందుతుండ‌టం సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. ఈ చిత్రంలో ఇన్‌ఫెర్టిలిటీ డాక్ట‌ర్ ఆంజ‌నేయులుగా త‌నికెళ్ల‌భ‌ర‌ణి సంద‌డి చేస్తున్నారు. ప‌ల్ల‌వి సుభాష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.

ఈ సంద‌ర్భంగా...

చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ - ''నరుడా డోన‌రుడా సినిమా కాన్సెప్ట్ తెలుగు ఆడియెన్స్‌కు చాలా కొత్త‌గా ఉంటుంది. నాగార్జున‌గారు విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్‌, మ‌హేష్ బాబు విడుద‌ల చేసిన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు టు మిలియ‌న్ వ్యూస్ రావ‌డం ఆనందంగా ఉంది. ఈ రెస్పాన్సే సినిమాపై ఆడియెన్స్ ఎంత ఆస‌క్తిగా ఉన్నార‌నే విష‌యాన్ని తెలియజేస్తుంది. సుమంత్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణిగారు, ప‌ల్ల‌వి సుభాష్‌, సుమ‌న్‌శెట్టి స‌హా ప్ర‌తి పాత్ర విల‌క్ష‌ణంగా ఉంటుంది. సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. వీలైనంత త్వ‌ర‌గా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

More News

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న వర్మ వంగవీటి ట్రైలర్

రక్తచరిత్ర,ది ఎటాక్ ఆఫ్ 26/11,కిల్లింగ్ వీరప్పన్...ఇలా నిజ జీవిత కథలను తెరకెక్కించే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం వంగవీటి.

స‌మంత‌తో త‌న పెళ్లి ఎప్పుడో చెప్పిన చైత‌న్య‌..!

నాగ‌చైత‌న్య - స‌మంత ప్రేమ‌లో ప‌డ‌డం, ఆత‌ర్వాత పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే...పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు..? ఏ సంప్ర‌దాయం ప్ర‌కారం చేసుకోబోతున్నారు..?

ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కే మ‌ళ్లీ ఆఫ‌ర్ ఇచ్చిన త్రివిక్ర‌మ్..!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్...ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ చిత్రం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందే ఈ భారీ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మించ‌నున్నారు.

జ‌త‌గా చిత్రానికి సెన్సార్ యు/ఎ

రింగులజుత్తు సోయ‌గం నిత్యామీన‌న్ - దుల్కార్ స‌ల్మాన్ కాంబినేష‌న్ అంటేనే యువ‌త‌రంలో విప‌రీత‌మైన‌ క్రేజు. మ‌ల‌యాళంలో వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ల త‌ర్వాత ఈ జంట న‌టించిన `ఓకే బంగారం` తెలుగులో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌. దుల్కార్‌-నిత్యా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `జ‌త‌గా`. మ‌ల‌యాళంలో జాతీయ అవార్డులు సంపాదించిన `ఉస్తాద్ హోట‌ల్‌`ని `జ‌

రోబో సీక్వెల్ రిలీజ్ డేట్....

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్, అక్షయ్ కుమార్, ఎమీజాక్సన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ రీసెంట్ గా పూర్తయ్యింది.