జాతీయ భద్రతకే అత్యంత ప్రాధానం

జాతీయ భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యం పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి వేధింపులు ఉండవు ఇక పన్ను చెల్లింపు దారుల చార్టర్ పన్ను ఎగవేత ఇక క్రిమినల్ నేరం కాదు..త్వరలో చట్ట సవరణ: నిర్మల పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో నాన్ గెజిటెట్ పోస్టుల భర్తీకి నేషనల్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు జాతీయ భద్రతే కేంద్రానికి అత్యంత ప్రాధాన్యమని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ఇవాళ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా పలు రంగాలకు శుభవార్త చెప్పగా.. మరికొన్నింటికి మొండిచెయ్యి చూపారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది శూన్యమనే చెప్పుకోవాలి. ఈ సందర్భంగా పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పిన ఆమె.. ఇకపై ఎలాంటి వేధింపులు ఉండవని.. ఇక పన్ను చెల్లింపు దారుల చార్టర్ ఉంటుందన్నారు. పన్ను ఎగవేత ఇక క్రిమినల్ నేరం కాదని తెలిపారు. అంతేకాదు.. ఇందుకు సంబంధించి త్వరలో చట్ట సవరణ చేస్తామన్నారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో నాన్ గెజిటెట్ పోస్టుల భర్తీకి నేషనల్‌ రిక్రూట్‌మెంట్ బోర్డును కేంద్రం నియమించింది.

బడ్జెట్ ప్రంసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు చూద్దాం..!

జమ్ముకు ఏమిచ్చారు..!?

జమ్మూకశ్మీర్ అభివృద్ధికి రూ.30,757 కోట్లు
లద్దాక్‌ అభివృద్ధికి రూ.5,958 కోట్లు

డిపాజిట్ చేస్తున్నారా..!?

పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు 3.50 లక్షల కోట్లు
డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంపు
బ్యాంకుల్లో ప్రైవేట్‌ భాగస్వామ్యం పెరగాలి
కంపెనీల చట్టంలో మార్పులు తెస్తాం

త్వరలో ఎల్‌ఐసీ వాటాల విక్రయం:-

ప్రభుత్వరంగ సంస్థల్లో మరిన్ని ఉద్యోగాలు
పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.8శాతం
2021 నాటికి ద్రవ్యలోటు 3.5 శాతం
త్వరలో ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటాల విక్రయం
2020-21లో జీడీపీ అంచనా 10 శాతం

ట్యాక్స్ లెక్కలు ఇవీ:-

కొత్త కంపెనీలకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ 15 శాతం
పాత కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ 22 శాతం
పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం 2.12 లక్షల కోట్లు
రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
రూ.5 లక్షల నుంచి 7.5లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతమే పన్ను
రూ.7.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15 శాతం పన్ను
రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20 శాతం పన్ను
12.5 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం పన్ను
రూ.15 లక్షలకుపైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను
రూ.15లక్షల వరకు ఆదాయమున్న వారికి రూ.78వేలు ప్రయోజనం
పాత రేట్ల ప్రకారం పన్ను చెల్లించేందుకు కూడా అనుమతి
పన్ను చెల్లింపుదారులకు కొత్త రేట్లు ఐచ్చికమే
అమలులో ఉండనున్న పాత, కొత్త ట్యాక్స్‌ విధానాలు
కొత్త ట్యాక్స్‌ విధానం ఎంచుకుంటే 80(సి) కింద వచ్చే మినహాయింపులు రావు

రియల్ ఎస్టేట్‌ రంగానికి కేంద్రం ఊరట
రియల్ ఎస్టేట్ కంపెనీలకు మరో ఏడాది పాటు పన్ను మినహాయింపు

More News

పవన్‌-హరీశ్ కాంబోలో సినిమా : మైత్రీ మూవీస్ ప్రకటన

టాలీవుడ్ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమానులకు మైత్రీ మూవీస్ తియ్యటి శుభవార్త అందించింది.

నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ‘శంకరాభరణం’

తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం ‘శంకరాభరణం’.

కమిడియన్ సంతానం హీరోగా సర్వర్ సుందరం

స్టార్ కమెడియన్ సంతానం హీరో గా తెరకెక్కిన సర్వర్ సుందరం తమిళ,  తెలుగు  భాషల్లో ఈ  ప్రేమికులు రోజు  కానుకగా ఫిబ్రవరి 14న విడుదలకి సిద్ధం అయ్యింది.

కేంద్ర బడ్జెట్-2020 ముఖ్యాంశాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్-2020 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నివేదికను సభ ముందుంచారు.

తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను - అల్లు అర్జున్

రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు.