close
Choose your channels

‘గే’ రూమర్స్‌పై నవదీప్ రియాక్షన్ ఇదీ..!

Tuesday, October 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘గే’ రూమర్స్‌పై నవదీప్ రియాక్షన్ ఇదీ..!

టాలీవుడ్ కుర్ర హీరో నవదీప్‌పై గత కొన్ని రోజులుగా ఓ పుకారు షికారు చేస్తున్న సంగతి తెలుస్తోంది. నవదీప్.. ‘గే’.. అమ్మాయిలకంటే అబ్బాయిలకు బాగా ఎట్రాక్ట్ అవుతాడు.. అతను తేడా’ అని అన్నదే ఆ పుకారు సారాంశం. అయితే ఈ విషయం టాలీవుడ్‌లో గట్టిగా వినిపించడం.. వెబ్‌సైట్లు పెద్ద ఎత్తున రాసేయడం.. మరోవైపు సోషల్ మీడియాలో హడావుడి జరుగుతుండటంతో ఎట్టకేలకు నవదీప్ స్పందించి ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఇలా తనను అంటున్నారన్న విషయాన్ని నవదీప్ బయటపెట్టుకుని.. ఆయనకు ఆయనగా క్లారిటీ ఇచ్చుకోవడం గమనార్హం.

నాపై లెక్కలేనన్ని రూమర్స్!

‘నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు రకారకాలుగా పుకార్లు పుట్టించారు. డబ్బున్న వాడినని.. బాగా బలిసినవాడినని.. బలుపెక్కువని అన్నారు. అంతేకాదు.. నాకు అబ్బాయిలంటే ఎక్కువ ఇష్టం గే అని రూమర్ క్రియేట్ చేశారు. ఒక వైపు అమ్మాయిలతో అదీ ఇదీ అంటూ చెప్తూనే ఉన్నారు. ఇలాంటి రూమర్స్ జరుగుతుండగా.. మీకు అబ్బాయిలంటే ఇష్టం అంట కదా అని ఒకడు నేను యూఎస్‌లో ఉండగా.. చాటింగ్‌లో అడిగాడు’ అని నవదీప్ ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుుకొచ్చాడు.

దండం పెట్టేశా..!

‘మీకు అబ్బాయిలంటే బాగా ఇష్టం అంట కదా.. నేనూ అంతేనండి అని అన్నాడు. మీతో మాట్లాడాలని ఉంది. మీతో నా ఫీలింగ్ పంచుకోవాలని ఉంది అని అన్నాడు. దానికి నేను.. ‘నాకు అబ్బాయిలు ఇష్టమా? అమ్మాయిలు ఇష్టమా? లేక మీకు ఎవరు ఇష్టం అన్నదాన్ని పక్కన పెట్టండి. మీరు ఎవరో నాకు తెలియదు. నీ ఫీలింగ్స్ నాకు చెప్పకు. నాకు ఇంట్రస్ట్ లేదు నీ ఫీలింగ్స్‌లో అని బై చెప్పి వాడికో దండం పెట్టేశా. వాడికి ఏం చెప్పాలో నాకు అర్ధం కాలేదు. చాటింగ్‌లో తప్ప డైరెక్ట్‌గా నన్ను గే అన్నది ఎప్పుడూ లేదు’ అని నవదీప్ చెప్పుకొచ్చాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.