'బన్నీ' బావకు ప్రేమతో నవదీప్ మరిచిపోలేని గిఫ్ట్

  • IndiaGlitz, [Saturday,June 22 2019]

టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నటుడు నవదీప్‌లు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. వీరి స్నేహం ‘ఆర్య-2’ సినిమాతో మరింత బలపడింది. అంతేకాదు.. బన్నీని నవదీప్ బావ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇలా పిలుచుకునే దాకా వచ్చిందంటే వీరిద్దరి మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తమ స్నేహానికి గుర్తుగా.. లైఫ్‌లాంగ్ గుర్తుండిపోయేలా అల్లు అర్జున్‌ బావకు గిఫ్ట్‌ ఇవ్వాలని భావించిన నవదీప్ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఈ గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన అల్లువారబ్బాయి తన ఫేస్‌బుక్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.

బావకు ప్రేమతో..

‘రుద్రమదేవి’ సినిమాలో బన్నీ గోనగన్నారెడ్డి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఆ లుక్‌ నచ్చిన నవదీప్‌‌.. సేమ్ టూ సేమ్‌ అదే లుక్‌తో ఓ చిన్న విగ్రహాన్ని తయారుచేయించాడు. ఈ విషయాన్ని బన్నీ దృష్టికి తీసుకెళ్లాడు. అయితే ఈ విగ్రహాన్ని త్వరలోనే బన్నీకి ఇవ్వనున్నట్టు నవదీప్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. బావకి ప్రేమతో చిరు కానుక అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ పోస్ట్ చేసిన బన్నీ.. ఫేస్‌బుక్‌లో రియాక్ట్ అయ్యారు.

బన్నీ పోస్ట్ సారాంశం ఇదీ..

ఔ.. గోనకన్నారెడ్డి.. గోనకన్నారెడ్డి.. నాకు ఎప్పుడూ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇదీ.. థ్యాంక్యూ బావ నవదీప్.. అని బన్నీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చేసిన నవదీప్, బన్నీ అభిమానులు, సినీ ప్రియులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఓహ్ స్వీట్ గిఫ్ట్ బాస్.. అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

More News

బాల‌య్య రౌడీ... పోలీసూ..!

బాల‌య్య రౌడీయా? పోలీసా? రౌడీగా రూల్ చేస్తారా? పోలీస్‌గా రూల్ చేస్తారా? ఏదైతేనేమి... మొత్తానికి రౌడీపోలీస్‌గా రూల‌ర్ అనిపించుకుంటాడా? అని అభిమానుల్లో కుతూహ‌లంగా ఉంది.

జ‌నాల‌కు ఉచితంగా నీళ్లు పంపిణీ చేస్తున్న ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్

చెన్నైలో నీటి ఎద్ద‌డి తీవ్రంగా ఉంది. గుక్కెడు మంచి నీళ్లు లేక ప్ర‌జ‌లు విల‌విల‌లాడుతున్నారు. భూగ‌ర్భ‌జ‌లాలు త‌గ్గిపోవ‌డం, వ‌ర్షాలు స‌రిగా ప‌డ‌క‌పోవ‌డంతో నీటిఎద్ద‌డి మొద‌లైంది.

షారుఖ్‌... అభిమానుల‌కు షాక్‌

షారుఖ్ త‌న అభిమానుల‌కు షాక్ ఇచ్చారు. ఎప్పుడూ సినిమాలేనా? నాకూ, నా ఫ్యామిలీకి కాస్త స‌మ‌యం వ‌ద్దా? నా కూతురు చ‌దువుతోంది. కొడుకు చ‌దువుతున్నాడు.

'నమ్మినబంటు'కు మంత్రి హోదా కల్పించిన వైఎస్ జగన్

కష్టకాలంలో వెన్నంటే ఉంటూ.. నమ్మకానికి మారుపేరుగా.. ఒక్క మాటలో చెప్పాలంటే నమ్మినబంటుగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి హోదా కల్పించారు.

ప‌వ‌న్ ఆ రోల్స్  చేస్తాడా?

మొన్న మొన్న‌టి దాకా ఎన్నిక‌ల ప్ర‌చారం, ఆ త‌ర్వాత ఎన్నిక‌లు, రీసెంట్‌గా ఫ‌లితాలు.. కొన్నాళ్లు కొత్త‌గా ఎంపికైన పార్టీల‌కు హ‌నీమూన్ పీరియ‌డ్‌..