ఏం చదివినా నమ్మకండి అంటూ నవీన్ పోలిశెట్టి ట్వీట్!

  • IndiaGlitz, [Saturday,July 03 2021]

కెరీర్ ఆరంభంలో నవీన్ పోలిశెట్టి క్యారెక్టర్ రోల్స్ చేశాడు. ఇప్పుడు హీరోగా రెండు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు చిత్రాలతో నవీన్ ఒక రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దీనితో నవీన్ తదుపరి చిత్రంపై ఆసక్తి నెలకొంది.

నవీన్ తన థర్డ్ మూవీని ఇంకా ప్రకటించలేదు. ఓ నెటిజన్ తనపై ప్రశంసలు కురిపించగా ఆ ట్వీట్ కు రిప్లై ఇస్తూ తన తదుపరి చిత్రం గురించి అప్డేట్ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి.

ఇదీ చదవండి: వైజాగ్ రామానాయుడు స్టూడియోపై కన్ను.. సురేష్ బాబుపై రాజకీయ ఒత్తిళ్లు?

'థాంక్ యు సోమచ్.. నా తదుపరి మూడు చిత్రాల కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నా సోషల్ మీడియా హ్యాండిల్ లో త్వరలోనే ప్రకటిస్తాను. ''ఇంకెక్కడా ఏం చదివినా నమ్మకండి- అల్బర్ట్ ఐన్ స్టీన్''. ఓ పెద్ద నిర్మాణ సంస్థతో కలసి వర్క్ చేయడం కల లాంటిది. మీ కోసం తయారు చేస్తున్న వాటిపై చాలా ఆసక్తిగా ఉన్నా' అని నవీన్ తెలిపాడు.

తనదైన శైలిలో ఫన్ మిక్స్ చేసి ఈ ప్రకటన చేశాడు. నవీన్ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ పై ప్రశంసలు దక్కుతున్నాయి. పెద్ద డైలాగులని సైతం అలవోకగా చెప్పి నవ్వించగల సత్తా ఉన్న నటుడు నవీన్. జాతి రత్నాలు తర్వాత నవీన్ చేయబోయే సినిమాపై భారీ అంచనాలు ఉంటాయనడంలో సందేహం లేదు. నవీన్ తదుపరి యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

More News

రాంచరణ్, శంకర్ సినిమాకు లైన్ క్లియర్.. హైకోర్టు నుంచి బిగ్ రిలీఫ్

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 చిత్రం ప్రారంభించినప్పటి నుంచి అనేక చిక్కులు మొదలయ్యాయి.

బ్యూటిఫుల్ పిక్స్: యష్, రాధికా దంపతుల కొత్త ఇంటి గృహ ప్రవేశం !

కెజిఎఫ్ సక్సెస్ తో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. తాజాగా యష్, రాధికా పండిట్ దంపతులు జీవితంలో సంతోషకరమైన కొత్త అడుగు వేశారు.

బ్రేకింగ్: విడిపోయిన అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు.. షాక్ లో బాలీవుడ్

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ జీవితంలో ఊహించని పరిణామం ఎదురైంది.

వైజాగ్ రామానాయుడు స్టూడియోపై కన్ను.. సురేష్ బాబుపై రాజకీయ ఒత్తిళ్లు?

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబుపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయా అంటే అవుననే ప్రచారం ఎక్కువవుతోంది.

ఇన్స్టాలో రిచ్ వీరే: ప్రియాంకని బీట్ చేసిన కోహ్లీ.. ఒక్కో పోస్ట్ కి అన్ని కోట్లా!

ప్రస్తుతం రోజుల్లో సోషల్ మీడియా పవర్ ఫుల్ మీడియంగా మారిపోయింది. సాధారణ మీడియా కంటే జనాలు ఎక్కువగా సోషల్ మీడియానే ఇష్టపడుతున్నారు.