నవీన్ పోలిశెట్టి హీరోగా 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్' సంస్థలు సంయుక్త నిర్మాణం

  • IndiaGlitz, [Wednesday,September 15 2021]

ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ, తన సక్సెస్ గ్రాఫ్ ను పెంచుకుంటూ సినిమా రంగంలో ఎదుగుతున్న సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్'. ఈ సంస్థ ఇప్పుడు మరో నూతన చిత్ర నిర్మాణ సంస్థ తో కలసి మరింత వినోదాన్ని పుష్కలంగా అందించటానికి సిద్ధమవుతోంది. ఆ నూతన చిత్ర నిర్మాణ సంస్థ పేరు ఫార్చ్యూన్ 4 సినిమాస్. ఈ సంస్థ కిది తొలి చిత్రం కాగా సితార ఎంటర్ టైన్మెంట్స్ కి 15 వ చిత్రం. తెలుగు సినిమా శ్రీకారం చుట్టుకున్న రోజు అయిన(1931,సెప్టెంబర్ 15) ఈరోజు నే ఈ ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థ పురుడు పోసుకోవడం విశేషం.

'నవీన్ పోలిశెట్టి' ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా. ఆయన కథానాయకుడు గా 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్' సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న తొలిచిత్రాన్ని ఈరోజు ఉదయం 9.36 నిమిషాలకు అధికారికంగా ప్రకటించాయి. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ప్రతిభగల యువకుడు కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ప్రేక్షకులుగా మీరు మరింత సరదాగా నవ్వుకోవడానికి సమాయుత్త మవ్వండి, మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాము అంటూ ప్రకటించారు. వినోదం పరమావధిగా నవీన్ పోలిశెట్టి సరికొత్త అవతారం ఈ చిత్రం స్వంతం. కథానాయకుడు గా ఆయనకిది మూడవ చిత్రం. చిత్ర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని వివరాలను, విశేషాలను మరో సందర్భంలో మీడియాకు ప్రకటించనున్నట్లు 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్' సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య లు తెలిపారు.

More News

రెజీనా క‌సాండ్ర న‌టించిన `నేనే నా..?` ట్రైల‌ర్ విడుద‌ల‌

ప్ర‌తి సినిమాకి త‌న న‌ట‌న‌లోని నైపుణ్యాన్ని నిరంతరం నిరూపించుకుంటోంది హీరోయిన్ రెజీనా క‌సాండ్ర‌.

'థ్యాంక్స్ సామ్' సమంత ట్వీట్‌కు చైతూ రిప్లయ్.. ఇప్పటికైనా రూమర్లు ఆగుతాయా..?

టాలీవుడ్‌లోని సెలబ్రెటీ కపుల్స్‌లో ఒకటైన అక్కినేని నాగచైతన్య, సమంతల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆస్పత్రిలో చేరిన కృష్ణంరాజు.. ఆరోగ్యంపై వదంతులు, క్లారిటీ ఇచ్చిన రెబల్‌స్టార్ కార్యాలయం

సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.

గణేష్ బెల్లంకొండ హీరోగా 'స్వాతిముత్యం'

వెండితెరకు మరో వారసుడు హీరో గా పరిచయం అవుతున్నారు. అతని పేరు "గణేష్ బెల్లంకొండ"

పెద్ద స్టార్ అయ్యుండి సింప్లిసిటీ: రోడ్ సైడ్ కాకా హోట‌ల్‌లో టిఫిన్ చేసిన బన్నీ.. ఫ్యాన్స్ ఫిదా..!

మెగా కాపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు అల్లు అర్జున్.