close
Choose your channels

నవీన్ విజయ్ కృష్ణ, కీర్తి సురేష్ 'ఐనా ఇష్టంనువ్వు' చిత్రం

Monday, September 14, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ కథానాయకుడిగా, కీర్తిసురేష్ కథానాయకిగా తెరకెక్కిన చిత్రానికి ''ఐనా ఇష్టంనువ్వు'' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తొలుత దీనికి ''ఐనా...ఇష్టం నువ్వు''. ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ దేవ్ విలన్ గా నటిస్తోన్న ఈ మూవీ
ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యింది. కేవలం మూడు రోజుల షూటింగ్ బ్యాలన్స్ మాత్రమే ఉంది.

నిర్మాత నట్టికుమార్ ఫైర్ ఈ చిత్రాన్ని తమకు అమ్మినట్లు బాండ్ పేపర్లు సాక్షాదరాలు ఉన్నాయి, అయినా సరే ఎస్ట్రా మనీ కోసం నిర్మాత చంటి అడ్డాల తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నిర్మాత నట్టి కుమార్ తెలిపారు.

ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్న ఈ సినిమా అక్టోబర్ చివరి వారంలో విడుదల కానుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఒక అందమైన ప్రేమకథగా ఈ సినిమా ఉండనుంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో సప్తగిరి, కొండవలస, చాందిని, ఫణి, రఘు తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సురేష్, సంగీతం: అచ్చు, నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి, దర్శకత్వం రాంప్రసాద్ రౌతు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.