close
Choose your channels

సూపర్‌స్టార్‌తో ఛాన్స్ కొట్టిన నయన్‌

Friday, January 31, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్‌స్టార్‌తో ఛాన్స్ కొట్టిన నయన్‌

నయనతార నక్కతోకను తొక్కినట్టే ఉంది. సీనియర్‌ హీరోయిన్లందరూ నిదానంగా ఇంటిదారి పడుతుంటే, నయనతార ముందు మాత్రం డైరక్టర్లు క్యూ కడుతున్నారు. అదీ చిన్నా చితకా సినిమాల కోసం కాదు. స్టార్‌ హీరోల సినిమాల కోసం. ఓ వైపు ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌తో సరదాగా సమయం గడుపుతున్న నయన్‌కి, సినిమాల్లో అవకాశాలు కూడా అంతే సీరియస్‌గా వస్తున్నాయి. మొన్నటికి మొన్న సంక్రాంతికి రజనీకాంత్‌తో కలిసి దర్బార్‌లో పలకరించింది నయన్‌. ఈ సినిమా వెంటనే రజనీకాంత్‌ ఓ సినిమాలో నటిస్తున్నారు.

సూపర్‌స్టార్‌తో ఛాన్స్ కొట్టిన నయన్‌

ఆ సినిమాకు శివ డైరక్ట్ చేస్తున్నారు. రజనీకాంత్‌ పక్కన ఈ సినిమాలో ఇప్పటికే కీర్తీ సురేష్‌, ఖుష్బు, మీనా నటిస్తున్నారు. ఇందులో మెయిన్‌ హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేశారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పక్కన నటించడం నయనతారకు కొత్తేం కాదు. చంద్రముఖితో మొదలైంది వీరి బంధం. ఆ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు శివ డైరక్షన్‌లో చేస్తున్నది నాలుగో సినిమా. తలైవర్‌ పక్కన ఏకంగా నలుగురు హీరోయిన్లు చేసేటంత సీన్‌ ఏం ఉంటుంది? అసలు కథలో అంత మంది నాయికలకు ఉన్న ప్రాధాన్యం ఏంటన్నది ఇప్పుడు అందరికీ అట్రాక్ట్ చేస్తున్న విషయం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.