మూడున్నర కోటి తీసుకుంటున్న నయనతార?

  • IndiaGlitz, [Monday,November 23 2015]

హిట్ రేట్ ఉంటే.. ఎంత డిమాండ్ చేసినా చెల్లుబాట‌వుతుంటుంది ఒక్కోసారి. ఆరేడేళ్ల క్రితం ఇలియానా కోటి రూపాయిల పారితోషికం తీసుకోవ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న వార్త‌గా నిలిస్తే.. ఇప్పుడు ఒక‌టిన్న‌ర, రెండు కోట్ల పారితోషికం తీసుకోవ‌డం హాట్ న్యూస్‌గా నిలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. సౌత్ హీరోయిన్ రెమ్యూన‌రేష‌న్ రేంజ్ 3.5 కోట్ల రూపాయిల‌కి చేరింద‌ని వినిపిస్తోంది.

అంత పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ మ‌రెవ‌రో కాదు.. త‌మిళంలో ఇటీవ‌లే హ్యాట్రిక్ కొట్టిన లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌. విక్ర‌మ్ హీరోగా ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌య‌న‌తార న‌టించ‌నుంద‌ని.. ఈ సినిమాకి న‌య‌న బాగానే కోట్ చేసింద‌ని గ‌త రెండు రోజులుగా న్యూస్ వినిపించింది.

అయితే.. లేటెస్ట్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ ప్ర‌కారం ఆ మొత్తం 3.5 కోట్ల రూపాయిల‌ని తేలింది. ఇందులో ఏ మాత్రం వాస్త‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది. అన్న‌ట్లు.. ఈ విక్ర‌మ్ సినిమాకి మొద‌ట అనుకున్న నిర్మాత‌లు ఇప్పుడు మారి వేరే వారు వ‌చ్చి చేరారు. అలాగే హీరోయిన్‌లు కాజ‌ల్‌, బిందుమాధ‌విలు కూడా మారిపోయారు. అలా కాజ‌ల్ ప్లేస్‌లోకి న‌య‌న చేరింది. పెద్ద మొత్త‌మే పారితోషికంగా తీసుకుంటోంది.

More News

స‌మంత కొత్త చిత్రం తారుమారు

'క‌త్తి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత విజ‌య్‌, స‌మంత జోడీ మ‌రోసారి క‌నువిందు చేయ‌నుంది. 'రాజా రాణి' ద‌ర్శ‌కుడు అట్లీ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాలో అమీ జాక్స‌న్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

విష్ణుకి వెరైటీగా విషెష్ చెప్పిన‌ ల‌క్ష్మ‌క్క‌..

హీరో మంచు విష్ణు పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా విష్ణు న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర‌దా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు.

ర‌జ‌నీ క‌బాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కిస్తున్నారు.

మెగాస్టార్ ఆ సినిమా చూసాడు...

మెగాస్టార్ 150వ సినిమా గురించి తనే స్వయంగా దసరా లోపు ప్రకటిస్తానని చెప్పారు.దసరా...దీపావళి వెళ్లిపోయాయి..కానీ ఇప్పటి వరకు 150వ సినిమా గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.

కళ్యాణ్ రామ్ న్యూమూవీ డీటైల్స్..

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన షేర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.దీంతో తదుపరి చిత్రంతో ఎలాగైనా సరే విజయం సాధించాలనుకుంటున్నాడు.