సిద్ధ‌మ్మ‌గా న‌య‌న తార లుక్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Sunday,November 18 2018]

చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'సైరా న‌ర‌సింహా రెడ్డి'. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్ర‌మిది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన తొలి యోధుడు ఓ తెలుగువాడు.. ఆయ‌నే ఉయ్యాల‌వాడ న‌ర‌సింహా రెడ్డి. ఆయ‌న జీవిత చ‌రిత్ర‌నే 'సైరా న‌ర‌సింహారెడ్డి'గా తెర‌కెక్కిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రామ్‌చ‌ర‌ణ్ నిర్మాణంలో సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది.

ఈ చిత్రంలో లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార చిరంజీవి భార్య సిద్ధ‌మ్మ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. నేడు న‌య‌న‌తార పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమె లుక్‌ను సైరా టీమ్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే ఈ చిత్రంలో గోసాయి వెంక‌న్న పాత్ర‌లో న‌టిస్తున్న అమితాబ్ బ‌చ్చ‌న్ లుక్‌.. అవుకురాజు పాత్ర‌లో కిచ్చా సుదీప్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.