'వాసుకి' చిత్రానికిగానూ ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్న నయనతార

  • IndiaGlitz, [Monday,June 19 2017]

స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'వాసుకి'. మ‌ల‌యాళ చిత్రం 'పుదియ నియ‌మం' చిత్రానికి అనువాద చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో న‌య‌న‌తార న‌ట‌న‌కు ఈ ఏడాది ఫిలింఫేర్ ఉత్త‌మ‌న‌టి అవార్డును న‌య‌న‌తార సొంతం చేసుకున్నారు. మ‌హిళ‌ల‌పై జ‌ర‌గుతున్న అకృత్యాల‌కు వ్య‌తిరేకంగా పోరాడే ఓ స్త్రీ క‌థాంశంతో వాసుకి సినిమా రూపొందింది. మ‌ల‌యాళంలో ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది.
'వాసుకి' పేరుతో శ్రీ‌రామ్ సినిమా ప‌తాకంపై ఎస్‌.ఆర్. మోహ‌న్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. లీడ్ రోల్ న‌య‌న‌తార చేయ‌డంతో పాటు ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న స‌మ‌స్య కావ‌డంతో సినిమాపై మంచి క్రేజ్ నెల‌కొంది. డిస్ట్రిబ్యూట‌ర్స్ కూడా సినిమాపై ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు.
న‌య‌న‌తార‌కు ఫిలింపేర్ అవార్డు రావ‌డం ఎంతో సంతోషంగా ఉంది. మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయిన ఈ చిత్రానికి తెలుగులో మంచి క్రేజ్ నెల‌కొంది. త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే చిత్ర‌మవుతుందని నిర్మాత ఎస్‌.ఆర్‌.మోహ‌న్ తెలిపారు.

More News

ఫ్యాన్సీ రేటుకు 'పిఎస్ వి గరుడ వేగ 126.18 ఎం' ఓవర్ సీస్ హక్కులు...

యాంగ్రీ యంగ్ మెన్ డా.రాజశేఖర్ కెరీర్లోనే 25 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ `పిఎస్వి గరుడవేగ 126.18ఎం`. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను డైరెక్టర్ చేస్తున్నారు.

జూన్ 20న 'జయదేవ్' ప్రీ రిలీజ్ ఫంక్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్కుమార్ భారీ స్థాయిలో 'జయదేవ్' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

సూర్య విలన్ గా కార్తీక్...

సీతాకోక చిలుక సహా పలు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించిన సీనియర్ ఆర్టిస్ట్ కార్తీక్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా సూర్య హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న `తానా సెంద కూట్టమ్` చిత్రంలో నటిస్తున్నాడు.

స్పైడర్ సీన్స్ లీక్ డ్..

సూపర్స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి బ్యానర్పై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'స్పైడర్`.

అంత కంటే బర్త్ డే గిఫ్ట్ ఏం కావాలంటున్న కాజల్...

మూడు పదులు వయసు దాటినా అందచందాలతో ప్రేక్షకులను మైమరిపిస్తున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రాధ అనే పాత్రలో నటించింది.