న‌య‌న్ స్పెష‌ల్‌

  • IndiaGlitz, [Friday,November 24 2017]

ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ త‌మిళంలో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా రాణించ‌డ‌మే కాకుండా.. కోలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది. మునుప‌టితో పోలిస్తే.. తెలుగులో న‌య‌న హ‌వా కాస్త త‌గ్గినా.. క్రేజ్ మాత్రం అలానే ఉంది. అందుకే.. మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహ బాల‌కృష్ణ కొత్త చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టించే అవకాశం ఆమెకే ద‌క్కింది.

కాగా, ఈ రెండు చిత్రాలు ఆమెకి ఎంతో స్పెష‌ల్ కానున్నాయి. ఎందుకంటే.. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి సంద‌ర్భాల్లోనే సంద‌డి చేయ‌నుండ‌డమే అందుకు కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. బాల‌య్య‌కి జోడీగా న‌టిస్తున్న జై సింహా వ‌చ్చే ఏడాది సంక్రాంతి టైమ్‌లో విడుద‌ల కానుండ‌గా.. చిరంజీవితో న‌టించ‌నున్న సైరా న‌ర‌సింహా రెడ్డి 2019 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

అంటే.. రెండు వ‌రుస సంక్రాంతి సీజ‌న్స్‌లో న‌య‌న సంద‌డి చేయ‌నుంద‌న్న‌మాట‌. ల‌క్ష్మీ, అదుర్స్ చిత్రాలు కూడా సంక్రాంతి స‌మ‌యంలో వ‌చ్చి విజ‌యం సాధించిన వైనం.. జై సింహా, సైరా విష‌యాల్లోనూ న‌య‌న్ కి రిపీట్ అవుతుందేమో చూడాలి.

More News

'వైశాఖం' మంచి సినిమాగా గుర్తింపు పొందడం ఎంతో సంతృప్తిగా వుంది - జయ బి

ఫిలిం ఎనలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ (ఫాస్‌) - అక్కినేని 2017 సినీ, టీవి అవార్డుల ప్రదానోత్సవం మరియు ఫాస్‌ సిల్వర్‌ క్రౌన్‌ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నవంబర్‌ 23న హైదరాబాద్‌ త్యాగరాయగాన సభలో చిత్ర ప్రముఖులు, ఆహుతుల మధ్య ఘనంగా జరిగింది.

2 కంట్రీస్ టీజ‌ర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

సునీల్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 2 కంట్రీస్ టీజ‌ర్‌ను నా చేతుల మీదుగా లాంచ్ చేయ‌టం ఆనందంగా ఉంది.  మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాలనిపించేలా టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టీజ‌ర్‌లాగానే సినిమా ఉంటుంద‌ని ఆశిస్తూ చిత్ర‌యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.

సప్తగిరి ఇంత బాగా డ్యాన్స్‌లు చేస్తాడని అస్సలు ఎక్స్‌పెక్ట్‌ చెయ్యలేదు - సాయిధరమ్‌ తేజ్‌

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డా.రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

బాబీ డైరెక్షన్ లో సాయిధరమ్‌ తేజ్?

'జైలవకుశ' సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర (బాబీ). తన మొదటి సినిమా 'పవర్'తో తొలి హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్.. రెండో చిత్రం స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌తో మాత్రం ప‌రాజ‌యం చ‌విచూశారు.

మ‌హేష్ సినిమా వాయిదా ప‌డిందా?

ఇటీవ‌లే స్పైడ‌ర్ సినిమాతో ప‌ల‌క‌రించారు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు. ప్ర‌స్తుతం ఆయ‌న కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భ‌ర‌త్ అనే నేనులో న‌టిస్తున్నారు.