మేలో విడుదలకు సిద్ధమవుతున్న నయనతార 'వాసుకి'

  • IndiaGlitz, [Friday,April 21 2017]

సౌతిండియాలో న‌య‌న‌తార‌ను సూప‌ర్‌స్టార్‌ని చేసిన మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ 'పుదియ నియ‌మం' శ్రీ‌రామ్ సినిమా ప‌తాకంపై ఎస్‌.ఆర్. మోహ‌న్ తెలుగులో 'వాసుకి'గా అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని సెన్సార్‌కి సిద్ధ‌మైంది.
ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎస్‌.ఆర్‌. మోహ‌న్ మాట్లాడుతూ - ''తెలుగు కోసం మా 'వాసుకి' చిత్రాన్ని ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా మ‌న నేటివిటీని ప్ర‌తిబింబిస్తూ, భారీ స్థాయిలో సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేశాం. నెలాఖ‌రులోగా సెన్సార్ పూర్తి చేసి, వేస‌వి కానుక‌గా రిలీజ్ చేస్తాం. తొలికాపీ చూశాక ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా భారీ స్థాయిలో సినిమాని రిలీజ్ చేయాల‌నుకుంటున్నాం. వాసుకి చిత్రం తెలుగులో అద్భుత విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.
ఈ చిత్రంలో త‌న న‌ట‌న‌తో న‌య‌న్‌ ప్ర‌తి తెలుగు ప్రేక్ష‌కుని మ‌న‌సులో సుస్థిర స్థానం ఏర్ప‌రుచుకుంటుంది. న‌య‌న‌తార చిత్రంతోనే మేం తెలుగు చ‌ల‌న‌చిత్ర రంగంలో అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రేక్ష‌కులు మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దిస్తార‌నే న‌మ్మ‌కంతోనే వేస‌వి కానుక‌గా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం. స‌హ‌క‌రించిన‌ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు'' అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: వ‌ర్గీస్ రాజ్‌, సంగీతం: గోపి సుంద‌ర్‌, బ్యాన‌ర్‌: శ్రీ‌రామ్ సినిమా, నిర్మాత‌: ఎస్‌.ఆర్‌.మోహ‌న్, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.కె.షాజ‌న్‌.⁠⁠⁠⁠ మాటలు:వెంకట్ మల్లూరి, పాటలు:భువనచంద్ర,వెన్నెలకంటి

More News

మే 19న 'జట్టు ఇంజనీర్ ' ఫస్ట్ లుక్

హింద్ కా నాపక్ కో జవాబ్ వంటి సూపర్హిట్ తర్వాత సెయింట్ డా.గుర్మీత్ రామ్ రహీం సింగ్ ఇన్ సాన్(డా.ఎం.ఎస్.జి) 'జట్టు ఇంజనీర్'

జూన్ 23న వరల్డ్ వైడ్ గా నాని, దానయ్య డి.వి.వి. చిత్రం 'నిన్ను కోరి'

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్.ఎల్.పి.పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం 'నిన్ను కోరి'.

కీర్తిసురేష్ తో సీనియర్ యాక్టర్ రొమాన్స్....

తెలుగు,తమిళ ప్రేక్షకులకు దగ్గరైన స్టార్ హీరోయిన్ ఇప్పుడు బిజి బిజీగా ఉంది.

విజయ్ దేవరకొండ, పరశురాం జిఏ2 చిత్రం ప్రారంభం

వరుస సూపర్హిట్ చిత్రాల తరువాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నివాసు నిర్మాతగా జిఏ2 బ్యానర్ లో పరుశురాం దర్శకత్వంలో, `పెళ్ళిచూపులు` ఫేం విజయ్ దేవరకొండ హీరొగా చిత్రం ఈ రోజు మాస్టర్ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వగా పూజాకార్యక్రమాలు జరుపుకుంది

రవితేజకు విలన్ అవుతున్న బాలీవుడ్ యాక్టర్...

మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్సిరికొండ దర్శకత్వంలో `టచ్చేసి చూడు`.ఈ సినిమా ఇప్పటికీ మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో పాటు రవితేజ అనిల్ రావిపూడి దర్శకత్వంలో `రాజా ది గ్రేట్` సినిమాలో నటిస్తున్నాడు.