'నీ జతలేక' ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుక

  • IndiaGlitz, [Wednesday,July 27 2016]

నాగశౌర్య, పారుల్‌, సరయు హీరో హీరోయిన్లుగా ఓగిరాల వేమూరి నాగేశ్వరరావు సమర్పణలో శ్రీ సత్య విదుర మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'నీజతలేక'. స్వరాజ్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వచ్చిందని చిత్రయూనిట్‌ బుధవారం హైదరాబాద్‌లో ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...

నిర్మాత జి.వి.చౌదరి మాట్లాడుతూ '' మా బ్యానర్‌లో వస్తున్న తొలి చిత్రం. పాటలకు మంచి స్పందన రావడం హ్యాపీగా ఉంది. అలాగే సినిమా చాలా బాగా వచ్చింది. ఆడియో తరహాలోనే సినిమా కూడా మంచి సక్సెస్‌ను సాధిస్తుందని భావిస్తున్నాను. స్వరాజ్‌ చాలా మంచి సంగీతాన్ని అందించాడు. సపోర్ట్‌ చేసిన నటీనటులకు, టెక్నిషియన్స్‌కు థాంక్స్‌'' అన్నారు.

నిర్మాత నాగరాజ్‌ గౌడ్‌ మాట్లాడుతూ '' స్వరాజ్‌ సంగీతంలో పాటలు మంచి సక్సెస్‌ను సాధిచడం సంతోషంగా ఉంది. దర్శకుడు లారెన్స్‌ దాసరి సినిమాను చక్కగా తెరకెక్కించాడు. పాటలులాగానే సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది'' అన్నారు.

దర్శకుడు లారెన్స్‌ దాసరి మాట్లాడుతూ '' నాపై నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు చౌదరి, నాగరాజ్‌ గౌడ్‌గారికి థాంక్స్‌. అలాగే స్వరాజ్‌ నా కథకు తగిన విధంగా మంచి సంగీతాన్ని అందించారు. నాగశౌర్య, పారుల్‌, సరయులు చక్కగా యాక్ట్‌ చేశారు. సినిమాను కూడా ఇలాగే పెద్ద సక్సెస్‌ చేస్తారని భావిస్తున్నాం'' అన్నారు.

ప్రతాని రామకృష్ణా గౌడ్‌ మాట్లాడుతూ '' సినిమా పాటలు బావున్నాయి. రేపు సినిమా కూడా ఇలాగే ఆదరణ పొందుతుందని భావిస్తున్నాం'' అన్నారు.

నాగశౌర్య మాట్లాడుతూ '' స్వరాజ్‌గారు మంచి సంగీతం అందివ్వగా, బుజ్జిగారు మంచి సినిమాటోగ్రఫీని అందించారు. సినిమాలో పాటలకు మంచి ఆదరణ లభినందుకు హ్యపీగా ఉంది. రేపు సినిమాను కూడా అలాగే సక్సెస్‌ చేస్తారని భావిస్తున్నాం. దర్శకుడు లారెన్స్‌ దాసరిగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు'' అన్నారు.

ఈ కార్యక్రమంలో సాయివెంకట్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, హీరోయిన్‌ సరయు, సినిమాటోగ్రాఫర్‌ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. యూనిట్‌ సభ్యులకు ప్లాటినమ్‌ డిస్క్‌లను అందజేశారు.

More News

వైశాఖం యూనిట్ స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగిన‌ హీరో హ‌రీష్ జ‌న్మ‌దిన వేడుక‌లు

చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ వంటి హిట్‌ చిత్రాల తర్వాత డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వైశాఖం.

అభినేత్రి విడుదల తేదీ ఖరారు

ప్రభుదేవా,తమన్నా,సోనూసూద్ ప్రధాన పాత్రల్లో ఎ.ఎల్.విజయ్ తెరకెక్కించిన విభిన్న కథాచిత్రం అభినేత్రి.

75 రోజులు పూర్తి చేసుకున్న 'బిచ్చగాడు'

బిచ్చగాడు సినిమా దండయాత్ర కొనసాగుతోంది. సైలెంట్‌గా వచ్చి వైలెంట్ హిట్ కొట్టిన బిచ్చగాడు 75 రోజులు కూడా దాటింది. 75 రోజులంటే ఐదో పదో థియేటర్లలో కాదు.. మొత్తం 200 థియేటర్లలో.. అవును.. ఏ స్టార్‌కీ తీసిపోని రీతిలో సుమారు 200 థియేటర్లలో 75 రోజులు పూర్తి చేసుకుంది బిచ్చగాడు.

అల్లు శిరీష్ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టిన డైరెక్టర్..

అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం శ్రీరస్తు శుభమస్తు.ఈ చిత్రాన్నిపరుశురామ్ తెరకెక్కించారు.

నాగ్ డైరెక్టర్ కి షాక్ ఇచ్చిన మహేష్

టాలీవుడ్ కింగ్ నాగార్జున-కోలీవుడ్ హీరో కార్తీ కాంబినేషన్లో ఊపిరి చిత్రాన్ని తెరకెక్కించి వంశీ పైడిపల్లి విజయం సాధించాడు.