20 ఏళ్ల అపురూప జ్ఞాపకాల సాక్ష్యం 'నీ కోసం'

  • IndiaGlitz, [Wednesday,December 04 2019]

తెలుగు సినిమా పుట్టుక మొదలు ఎన్నో సినిమాలు వస్తున్నాయి...పోతున్నాయి. అయితే ఈ నిరంతర సినీ మజిలీలో కొన్ని సినిమాలు మాత్రం మైలురాళ్ళగా నిలిచిపోతుంటాయి. ఆలా అపురూప జ్ఞాపకాల దొంతర్లలో మిగిలిపోయిన అవార్డుల సినిమా నీ కోసం. రవితేజ, మహేశ్వరి నాయకా నాయికలుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వల్లభనేని జనార్దన్ సమర్పణలో ఘంటా శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం విడుదలై...మంగళవారానికి సరిగ్గా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1999 డిసెంబర్ 3న విడుదలైన ఈ ఫీల్ గుడ్ చిత్రానికి అప్పట్లో అవార్డులతో పాటు ప్రేక్షకుల రివార్డులు లభించాయి.

1999వ సంవత్సరానికి 5 నంది అవార్డులను అందుకుని అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ చిత్రం అప్పట్లో రెండో ఉత్తమ చిత్రంగా నంది అవార్డును అందుకుంది. రవితేజకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాదు హీరోగా నిలదొక్కునే చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అంతే కాదు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా రవితేజకు లభించింది. ఇక మహేశ్వరికి ఉత్తమ నటిగా నంది అవార్డు, శ్రీను వైట్లకు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు, ఉత్తమ పరిచయ దర్శకుడిగా శ్రీను వైట్ల మరో నంది అవార్డును అందుకున్నారు. ఉత్తమాభిరుచే ఇలాంటి చిత్రం రూపొందానికి కారణమని అంటారు నిర్మాత ఘంటా శ్రీనివాసరావు. చిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ మేనేజర్ గా సుదీర్ఘ అనుభవం గడించుకున్న ఆయన మొదటిసారి నిర్మాతగా మారి తీసిన చిత్రమిది.

ఈ చిత్రం 20 ఏళ్ల మజిలీ సందర్బంగా నాటి ముచ్చట్లను నిర్మాత ఘంటా శ్రీనివాసరావు పంచుకుంటూ.... ప్రఖ్యాత నిర్మాత, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు అంటే నాకు ప్రత్యేక అభిమానం. అప్పట్లో ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఆయనకు ఎలాగైనా చూపించాలని అనుకున్నాను. ఆయనను సంప్రదించి చిత్రం చూడమని కోరం. దాంతో ఆయన చిత్రాన్ని చూడటంతో పాటు చిత్రాన్ని తామే కొనుగోలు చేసి...వారి మయూరి సంస్థ ద్వారా విడుదల చేసారు. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరు తెచ్చి పెట్టడమే కాదు కెరీర్ ను సైతం మలుపు తిప్పింది. రాంప్రసాద్ కెమెరామెన్ గా మరింత బిజీ అయ్యారు. ఆర్.పి పట్నాయక్ ఇది తొలి చిత్రం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం కోసం ఓ పాట కూడా కంపోజ్ చేసారు. ఇలా ఆ చిత్రం గురించి ఏది గుర్తు చేసుకున్నా మధురాతి మధురమే అంటారు ఘంటా శ్రీనివాసరావు.

More News

'ఎర్ర‌చీర‌' లో తొలి తొలి ముద్దు రొమాంటిక్ గీతం

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బేబి ఢ‌మరి సమర్పణలో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతోన్న‌ చిత్రం `ఎర్రచీర`. సి.హెచ్ సుమ‌న్ బాబు స్వీయద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు

‘విక్రమ్’ ల్యాండర్ జాడపై ఏంటీ కన్ఫూజన్.. కన్ఫూజన్!

ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లో భాగంగా విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడిపైకి పంపగా..

కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉన్న ల‌వ్‌స్టోరీ `మిస్ మ్యాచ్‌` ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది - హీరో ఉద‌య్ శంక‌ర్‌

'ఆటగదరా శివ' లాంటి డీసెంట్‌ హిట్‌ చిత్రంలో సహజమైన నటనతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పు కున్నారు యంగ్‌ హీరో ఉదయ్‌ శంకర్‌.

'బ్యూటిఫుల్' సెన్సార్ పూర్తి

 టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక).

కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన హీరో సందీప్ కిషన్

కథానాయకుడిగా, నిర్మాతగా ఈ ఏడాది సందీప్ కిషన్ మంచి విజయాలు అందుకున్నారు. ఆయన నిర్మాతగా పరిచయమైన చిత్రం 'నిను వీడని నీడను నేనే'.